39.2 C
Hyderabad
March 28, 2024 16: 57 PM
Slider తెలంగాణ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదు

bjp kamareddy

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అన్ని ప్రాంతాల్లో పాదయాత్రలు చేపట్టామని తెలిపారు. ప్రతి శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఈ పాదయాత్ర చేపట్టాలని చెప్పారు. అందులో భాగంగానే నేడు కామరెడ్డికి వచ్చామన్నారు. గాంధీ జయంతి ఉత్సవాల సందర్బంగా బీజేపీ పాదయాత్ర చేపట్టిందని తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10 వరకు  15 రోజుల్లో 150 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థికమాంద్యం రావడానికి ముఖ్యమంత్రి కేసీఆరె కారణమన్నారు. ప్రభుత్వం వాస్తవ బడ్జెట్ ని ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో లక్ష 80 వేల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ వాస్తవ బడ్జెట్ వచ్చేసరికి లక్ష 40 వేలకు తగ్గిందన్నారు. వాస్తవ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పినా పెడచెవిన పెట్టారని విమర్శించారు. ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, ఆర్థిక క్రమశిక్షణ పాటించని ఏ ముఖ్యమంత్రికైనా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని నిందలు వేశారని, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం నిధులు ఇవ్వకపోవడం వల్లనే కేంద్రం నుంచి రావాల్సిన 60 శాతం నిధులు నిలిచిపోయాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన 20 వేల కోట్ల నిధులు ఆగిపోయాయని వెల్లడించారు. ఆర్టీసీ నష్టానికి ప్రభుత్వమే కారణమని అన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం 2 వేల 500 కోట్ల రూపాయల నిధులు బకాయి పడిందని, ఈ నిధులు ప్రభుత్వం చెల్లిస్తే ఆర్టీసీ నష్టాల్లో ఉండేది కాదని తెలిపారు. కార్మిక చట్టాలను లోబడే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారని, కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగులను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

జొన్నాడలో హిజ్రా దారుణ హత్య

Bhavani

తెలంగాణ సీఎం ఆశీస్సులు తీసుకున్న ఏపి మంత్రి

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment