29.7 C
Hyderabad
April 18, 2024 06: 49 AM
Slider తెలంగాణ

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

pjimage (1)

స్వచ్చ భారత్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో కీలకమైన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్చ దర్పణ్ ఫేస్ – 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది. దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించగా ఎనిమిది జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. ఈ ఎనిమిది జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ఉన్నాయి. వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు ద్వారక ( గుజరాత్ ), రేవరీ ( హర్యానా ) జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు సైతం ఇదే తరహాలో పురోగతి చూపించాయి. స్వచ్చ భారత్ అమలు తీరుపై అంచనాల కోసం కేంద్ర ప్రభుత్వం దశల వారీగా సర్వేలు నిర్వహిస్తోంది. వివిధ అంశాలను పరిగణలోలకి తీసుకుని సర్వే ఫలితాల ఆధారంగా గరిష్టంగా వంద మార్కులను వేస్తారు. పూర్తి స్థాయి మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, నిర్వహణ, కమ్యూనిటీ సోక్ పిట్స్, కంపోస్టు పిట్స్, స్వచ్ఛ భారత కార్యక్రమాలపై అవగాన పెంచడం, జియో ట్యాగింగ్ పరిశీలన వంటి అంశాలపై దేశంలోని మొత్తం 100 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. దేశంలోని ఎనిమిది జిల్లాలకు వందకు వంద మార్కులు నమోదయ్యాయి. వీటిలో మన రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల సంఖ్య 42, 33, 614 ఉంది. 2014 వరకు 11, 56, 286 కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇప్పుడు వంద శాతం లక్ష్యం పూర్తయ్యింది. పెరిగిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కొత్త మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని కేంద్ర ప్రభుత్వ సర్వేలో నమోదైంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నిరంతర పర్యవేక్షణతో ఇప్పుడు స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టిన కార్యాచరణతో మంచి ఫలితాలు వస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ‘ స్వచ్చ దర్పణ్ లో మన రాష్ట్రంలోని మంచి పనితీరు కనబరిచినట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేతో స్పష్టమైంది. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఎనిమిది జిల్లాలు ఉంటే. . . వాటిలో ఆరు జిల్లాలు ఉండడం గర్వకారణం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటి వినియోగంపై అవగాహన కల్పించాం. స్వచ్ఛ దర్పన్ లో తాజా ఫలితాల కోసం పని చేసిన ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, జిల్లాల కలెక్టర్లకు జిల్లా పరిషత్ చైర్మన్లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు , ఎంపీడీవోలకు, ఉపాధి హామీ సిబ్బందికి, డీఆర్డీఏ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక అభినందనలు ‘ అని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

కారూ కమలమూ ఒక బ్యాలెట్ పేపరూ

Satyam NEWS

ఇంటికో ఉద్యోగం ఏమైంది? నిరుద్యోగులారా ఆలోచించండి

Satyam NEWS

లంచం తీసుకున్న స్పెషల్ డిప్యూటి తహశీల్దార్ జైలు శిక్ష

Bhavani

Leave a Comment