35.2 C
Hyderabad
April 20, 2024 17: 10 PM
Slider ప్రత్యేకం

షేమ్ షేమ్: భారత భూభాగం నుంచి పాకిస్తాన్ కు కితాబు

pakistan trump

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే కావచ్చు కానీ మన దేశానికి వచ్చి పాకిస్తాన్ ను పొగుడుతాడా? ఇదేమి అన్యాయం అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో మాట్లాడిన ట్రంప్ పాకిస్తాన్ ను ఆకాశానికెత్తేశాడు. పాకిస్తాన్ తో అమెరికా సంబంధాలు ఎంతో బాగున్నాయని ఆయన చెప్పడం ఒక్క సారిగా భారత ప్రజలను నిర్ఘాంత పోయేలా చేసింది.

పాకిస్తాన్ తో మా సంబంధాలు ఎంతో మెరుగుగా ఉన్నాయి. దక్షిణాసియా లోని అన్ని దేశాలూ కలిసి మెలిసి ఉంటాయని భావిస్తున్నాము. ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనాలి అని ట్రంప్ అన్నాడు. ట్రంప్ భక్తులు ఈ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంటు చేయరేంటి అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి అక్కడ మహాత్మాగాంధీ గురించి ప్రస్తావించకపోవడం అన్యాయమని మరి కొందరు విమర్శలు గుప్పించారు. సబర్మరీ ఆశ్రమానికి వెళితే ఎవరికైనా మహాత్మా గాంధీ గుర్తుకు వస్తారు. ట్రంప్ కు మాత్రం గాంధీ గుర్తుకురాలేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts

Plank Room Online marketing

Bhavani

విజయసాయి రెడ్డి ట్రస్టు లావాదేవీలపై విచారణ జరపాలి

Satyam NEWS

శ్రీ పెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment