36.2 C
Hyderabad
April 25, 2024 20: 53 PM
Slider కృష్ణ

మా వద్ద 24 గంటలు ఇసుక సప్లయ్ చేయబడును

sand_mining-696x392

మా వద్ద 24 గంటలు ఇసుక సప్లయ్ చేయబడును అంటూ బోర్డులు పెట్టేశారు కొందరు. వారికి  మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొందరు సహకారం అందించారు. మరింకేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. పైసా పెట్టుబడిలేని వ్యాపారం. రాష్ట్రంలో ఉన్న ఇసుక కొరతను ఇలా కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని దోచుకుంటున్న  ముఠా ఒకటి నందిగామ పోలిసులకి చిక్కింది. నదులకు భారీ వరదల కారణంగా రాష్ట్రాంలో ఇసుక కొరత ఏర్పడి ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు మరొ పక్క గృహ నిర్మాణ దారులు అల్లాడు తుంటే, మరో పక్క ఆన్ లైన్ లో కొందాం అన్నా ఎప్పుడూ చూసినా వెబ్ సైట్లో నో స్టాక్ కనిపిస్తుంది. అయితే నందిగామ కేంద్రంగా ఇసుక ఆన్ లైన్ మాఫియాకు మాత్రం నిత్యం ఆన్ లైన్ లో  ఇసుక బుకింగ్ జరుగుతుంది. ఇలా ఎవరి ఎవరివో ఆధార్ కార్డులు సేకరించి ఈ ఆన్ లైన్ కార్యక్రమం స్థానిక మీ సేవ కేంద్రాల ద్వారా చేస్తూ ఇసుక అత్యవసరం అయిన వారికి భారీ మొత్తానికి అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు యువకులను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీ సేవా నిర్వహకుల మీదా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు, వినియోగదారుడి వివరాలు లేకుండా ఇసుక ఎలా బుకింగ్ చేస్తున్నాడు బుకింగ్ చేసినప్పుడు ఆన్ లైన్ లో ఎవరి ఖాత నుంచి నగదు బదిలీ అవుతుంది ఇలాంటి విషయాలపై కూడ పోలీసులు దృష్టిలో ఉంచుకుని ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించాలని ఇసుక వినియోగదారులు కోరుతున్నారు.

Related posts

మానసిక వికలాంగుల పట్ల సమాజానికి బాధ్యత ఉంది

Satyam NEWS

తూకంలో తరుగుపై ధాన్యం రైతుల గగ్గోలు

Satyam NEWS

వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment