35.2 C
Hyderabad
April 20, 2024 16: 41 PM
Slider తెలంగాణ

రెడ్ హ్యాండెడ్ గా ఏసీబికి దొరికిపోయిన ఇద్దరు రిపోర్టర్లు

reportes

మునిసిపల్ అధికారులతో ములాఖాత్ అయి ఇళ్లు నిర్మాణం చేద్దామనుకునే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు రిపోర్టర్లను, ఒక జీహెచ్ఎంసీ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. మరో రిపోర్టర్ పరారీలో ఉన్నాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వారిలో జీహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ సిద్ధాంతం మదన్ రాజ్ తో పాటు మన తెలంగాణ రిపోర్టర్ సోపాల శ్రీనివాస్, ఆంద్ర ప్రభ రిపోర్టర్ ఆకుల కిరణ్ గౌడ్ ఉన్నారు. వీరు ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా మరో రిపోర్టర్ పారిపోయాడు. జూబ్లీహిల్స్ లో ఒక షెడ్డు నిర్మాణం విషయంలో వీరు 2 లక్షలు డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లో నే కాకుండా మణికొండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ రిపోర్టర్లు భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు నిఘావేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సెక్షన్ ఆఫీసర్ తో పాటు రిపోర్టర్లు సోపాల శ్రీనివాస్, ఆకుల కిరణ్ గౌడ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో విచారిస్తున్నారు.

Related posts

కొత్త చీఫ్ సెక్రటరీ గా సోమేశ్ కుమార్

Satyam NEWS

పార్టీలో చేరనందుకు రేషన్ డీలరైపై వైసీపీ ప్రతాపం

Satyam NEWS

గరుడ వాహన సేవలో సౌమ్యనాధ స్వామి….

Satyam NEWS

Leave a Comment