24.7 C
Hyderabad
March 29, 2024 07: 28 AM
Slider ప్రత్యేకం

సర్వే సత్యం :వేములవాడ మున్సిపాలిటీ పై తెరాస జెండా

vemulawada muncipal elections survey

వేములవాడ మున్సిపాలిటీ కి బుధవారం జరిగిన ఎన్నికల్లో తెరాస ఆధిపత్య దిశలో అత్యధిక సీట్లు కైవసం చేసుకు వేములవాడ మున్సిపాలిటీ పై తెరాస జండా ఎగురవేస్తుందని సత్యం న్యూస్ ఎగ్జిట్ పోల్ సర్వే లో వెల్లడైంది.మొత్తం ఓట్లలో 43 శాతం తెరాస గెల్చు కోగా, 27 శాతం బీజేపీ, 12 శాతం కాంగ్రెస్ ,ఇండిపెండెంట్లు 8 శాతం,ఓట్లు పంచుకున్నట్లు సర్వే లో వెల్లడైంది.

వేములవాడ లో పురుషులకంటే మహిళలే అత్యధికంగా వోట్ హక్కు ను వినియోగించుకున్నట్లు సత్యం న్యూస్ సర్వే లో వెల్లడైంది.మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34, 615 ఓట్లు పోలవ్వగా 14,754 ఓట్లను మహిళలు,13,278 ఓట్లను పురుషులు వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 1476 ఓట్లు అత్యధికంగా వినియోగించుకున్నారు. 21 వార్డులో అత్యధిక పోలింగ్ 90.70 శాతం11వ వార్డులో 70.15 శాతం అత్యల్పంగా పోలయ్యాయి.

మహిళాలు ఎక్కువగా తెరాస వైపుకు మొగ్గు చూపినట్లు,ముఖ్యం గా వృద్దులు తెరాస వైపే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.మొత్తం 28 స్థానాలకు గాను 13 నుండి స్థానాల్లో 16 తెరాస, 6 నుండి 8 స్థానాల్లో బీజేపీ, 2 నుండి 4 స్థానాల్లో కాంగ్రెస్ ,త్రీ లేదా 5 స్థానాలు ఇండిపెండెంట్ లు గెలిచే అవకాశాలు ఉన్నట్లు సత్యం న్యూస్ సర్వే లో వెల్లడైంది.

వార్డుల వారీగా వివారాలు ఇలా ఉన్నాయి.1వార్డ్ కాంగ్రెస్ లేదా ఇండిపెండెంట్ ,2వార్డ్ తెరాస ,3 వార్డ్ఇండిపెండెంట్ ,4 వార్డ్ బీజేపీ ,5 వార్డ్ తెరాస ,6 వార్డ్ తెరాస ,7 వార్డ్ ఇండిపెండెంట్, 8వార్డ్ ఇండిపెండెంట్ ,9 వార్డ్ కాంగ్రెస్ లేదా తెరాస ,10 వార్డ్ ఇండిపెండెంట్ లేదా తెరాస ,11 వార్డ్ తెరాస ,12 వార్డ్ బీజేపీ ,13 వార్డ్ బీజేపీ ,14 తెరాస ,15 బీజేపీ ,16 తెరాస,17ఇండిపెండెంట్ లేదా తెరాస ,18 తెరాస లేదా బీజేపీ,19 బీజేపీ ,20 తెరాస లేదా ఇండిపెండెంట్ ,21 బీజేపీ లేదా తెరాస ,22 తెరాస లేదా బీజేపీ 23 ,తెరాసా లేదా బీజేపీ , 24 కాంగ్రెస్ లేదా ఇండిపెండెంట్ ,25 తెరాస ,26 తెరాస లేదా బీజేపీ, 27 తెరాస, 28 బీజేపీ లు విజయం సాదించనున్నట్లు సర్వే లో వెల్లడైంది.

ఒకటి రెండు స్థానాలు అటు ఇటు మారవచ్చని సర్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వార్డ్ కు 100 శాంపిల్ తీసుకుని ఎనాలిసిస్ చేయడం జరిగిందని సత్యం న్యూస్ సర్వే ప్రతినిధి వెల్లడించారు.కాగా ప్రత్యేకించి వేములవాడ ఏమ్మెల్యే 5 స్థానాల్లో మూడు స్థానాల్లో తెరాస ఓడిపోనున్నట్లు సర్వే లో వెల్లడైంది.వేములవాడ ఎమ్మెల్యే తో రమేష్ బాబు తో పాటు జిల్లా మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా వేములవాడ పై ద్రుష్టి పెట్టినప్పటికీ అనుకున్నానని సీట్లు తెరాస సాధించాక పోవడం పై వారిరిరువు ప్రత్యేక ద్రుష్టి పెట్టాల్సి ఉంది.

Related posts

భవిష్యత్తు కృత్రిమ మేధస్సుదే

Bhavani

ఏప్రిల్ 3 నుంచి సలేశ్వరం జాతర

Satyam NEWS

కరోనాను జయించిన ములుగు యువకుడు

Satyam NEWS

Leave a Comment