32.7 C
Hyderabad
March 29, 2024 10: 28 AM
Slider కరీంనగర్

రాజన్న:భక్తులను కోడెలు కుమ్మకుండా చూడయ్యా

kode mokku vemulawada temple

పశుపతి రాజన్నకి పశువైన ఎద్దును నంది రూపంలో భక్తితో ప్రజలు సమర్పించే కానుకే కోడెమొక్కు.వందలాది సంవత్సరాలనుండి ఇక్కడ ఇది ఆచారం.కాగా పెరుగుతున్న భక్తుల రద్దీ కి అనుగుణంగా ఆలయం లేకపోవడంతో కోడెలు మనుషులు ఎదురెదురవుతుండటం,కోడెల మేడలో వేసే పులా దండలను తినాలనే ఆలోచనతో అవి తలతో ముందుకు కుమ్మడం వాళ్ళ పలువురు గాయలాపాలవుతున్నారు.వెరసి సంతోషం గా వచ్చిన జాతరలో కుమ్మిన గాయాలతో ఇంటికి వెళ్లే భక్తులు ఉసూరుమంటూ వాటిని కుమ్మకుండా చూడమని రాజన్నను వేడుకుంటున్నారు.


ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో కోడెల కుమ్మకుండా బెదరకుండా చూడాలని భక్తులు ఆ పశుపతినే కోరుతున్నారు.ఏ కష్టమొచ్చినా రాజన్నకు కోడెను కడితే కోడె మొక్కుల రాజన్న కోర్కెలు తీరుస్తాడనే భక్తుల విశ్వాసం. వేములవాడ కు సాలీనా అత్యధికం గా ఆదాయాం తీసుకువచ్చే ఈ కోడె మొక్కు ను చెల్లించుకునేందుకు ఆలయం లో రద్దీ ఉన్నప్పుడు ఆపసోపానాలు పాడుతున్నారు భక్తులు.రాజన్న కొలువున్న గర్భ గుడి ఎదురుగా కోడెల బండకు కోడెల కట్టే ఆచారం ఉండగా అక్కడే దర్శనానికి వెళ్లే భక్తులు అక్కడే అభిషేకాలు,అన్న పూజల లైన్ లు ఉండటం ఆలయం ఇరుకుగా ఉండటం తో కోడెలు భక్తుల పైకి దూసుకు వస్తున్నాయి.

దీనితో భక్తులు ముందుకు పరిగెత్తడం ఆడవారు,పిల్లలు కింద పడటం వారిపై నుండే భక్తులు భయం గా పరిగెత్తడం చేయడం తో ఒక్కోసారి తొక్కిసలాట జరిగి పలువురికి గాయలవుతున్న సంఘటనలు కోకొల్లలు.ఇలాంటి సంఘటనే సోమవారం ఉదయం ఆలయం లో జరుగగా నలుగురు గాయపడ్డారు.వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపారు. కాగా వేములవాడ దేవాలయం లో కోడెలకు సెపరేట్ గా లైన్ వేయాలని అధికారులను కోరుతున్న ప్పటికి పట్టించు కున్న పాపానపోలేదు.ఇప్పటికైనా ఈ.ఓ కృష్ణవేణి ఈ సమస్యపై ద్రుష్టి సారించి భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.దీనికి తోడు భక్తులు అధికం గా ఉన్నప్పుడు ఆలయం లోనే ఒక ప్రాథమిక చికిత్స సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు.

Related posts

పేదలకు మెరుగైన వైద్య సేవలు

Bhavani

అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లో 100 ఇళ్లు నిర్మించుకున్న చైనా

Sub Editor

సిలిండర్‌ పేలి ఐదుగురు పిల్లలు దుర్మరణం

Sub Editor

Leave a Comment