39.2 C
Hyderabad
April 23, 2024 17: 01 PM
Slider ప్రత్యేకం

కమిట్మెంట్:దుర్వాసన లేకుండా ధర్మగుండం బాగుపరిచేదెలా

e.o krishna veni at dharma gundam

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడలో భక్తుల కోర్కెలు తీర్చే కోనేరు రాజన్న ధర్మ గుండం ను బాగుపర్చేందుకు వేములవాడ ఆలయ ఈ.ఓ కృష్ణ వేణి తీవ్రం గా ప్రయత్నిస్తున్నారు.లక్షలాది మంది భక్తులు వేములవాడ చేరుకొని ధర్మ గుండం లో స్నానం ఆచరించి రాజన్న ను దర్శించడం ఆనవాయితీ.అయితే గుండం లో నీటి వూట లేక పోవడం తో పాటు భక్తులు సమర్పించే కానుకలతో ,కొబ్బరి ముక్కలతో ధర్మగుండం దుర్వాసన వెదజల్లుతుండగా రానున్న శివరాత్రి వరకైనా దీనిని బాగుచేసి భక్తుల స్నానాలకు ఉపయోగించేలా చూడాలని ఈ.ఓ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రయత్నిస్తుంది.

ఇందు కోసం గుండం ఫై ఆదాయం వచ్చే కొబ్బరి చిప్పల సేకరణ టెండరును కుడా ఆమె రద్దు చేయటం గమనార్హం. రాజా రాజా నరేంద్రుడి స్వయం గా ఈ పుష్కరిణిలో స్నానమాడిన సందర్భం తో పాటు,నాంపల్లి గుట్ట సొరంగం నుండి నవనాథ సిద్దులు స్వయం గా ప్రతి రోజు ప్రభాత కాలం లో విచ్చేసి రాజన్నను అభిషేకించి పూజిస్తారని చరిత్ర చెబుతుండగా ధర్మ గుండం ఫై ఇప్పటి వరకు అధికారులు నిర్లక్ష్యం చూపారు.ఒక శంకర్ రెడ్డి ఈ.ఓ గా ఉన్న సమయం లో మాత్రమే తిరుపతి లో ఈ గుండాన్ని తీర్చి దిద్దాలని అనుకుంటుందా గానే ఆయన బదిలీ ఫై వెళ్లిపోయారు.

అదే ఆలోచనలు అంటే నిజాయితీ గల ఈ.ఓ కృష్ణ వేణి ధర్మగుండాన్ని పునరుద్దరించాలని ఆలోచన తో మంగళవారం మొత్తం అక్కడే ఉండి ఇంజినీరింగ్ అధికారులతో సమయ ప రిస్కారానికి యత్నించింది.లోయర్ మానేరు డాం నుండి నేరుగా నీరు తెచ్చి గుండం లో నింపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.నీటి ఫిల్టర్ కోసం తిరుపతి తరహా పథకాలను రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలుజారి చేశారు.నిత్యం నీటి తో కల కల లాడేలా ధర్మగుండం భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంజినీరింగ్ అధికారులు ఆమెకు సంహరించడం లేదని లేదా కొందరు అధికారులు అమ్యమ్యాల కోసం ఎస్టిమేషన్ అధికం గా వేస్తూ బిల్లులు పెడుతున్నారని ఆమె గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.

గత ఈ.ఓ హయం లో ప్రయోజనాలు పొంది ఇప్పుడికి ఇంకా మారని అధికారులు కోర్ట్ పక్కనే ఉన్న పులా తోటలో వాచ్ మెన్ షెల్టర్ కు రూ ఐదు లక్షలు బిల్లులు పెట్టడం పై ఆమె ఆగ్రహం గా ఉండి.తక్కువ ఖర్చు తో నిజాయితీ గా పని చేసి ధర్మ గుండం భక్తుల స్నానాల కు అనుగుణం గా తీర్చి దిద్దాలని ఆమె అధికారులను కోరడం కోసం మెరుపు.కాగా ఈ.ఓ కృష్ణ వేణి మంగళవారం ధర్మ గుండం వద్ద తానె స్వయం గా కూర్చుని పనులు పురమాయించడం తో వేములవాడ ప్రజా మన్నలను పొందింది.

Related posts

రష్యాతో రాజీ: వెనక్కి తగ్గిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ

Satyam NEWS

కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయడం మరచిపోయిన ప్రభుత్వం

Satyam NEWS

కుల సంఘాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడింది

Satyam NEWS

Leave a Comment