32.2 C
Hyderabad
March 28, 2024 21: 42 PM
Slider తెలంగాణ

నో సింపతీ: అంకిత భావం అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

vote devlopment sympathy

ప్రజలు సానుభూతితో ఓటు వేయవద్దన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు జమ్మికుంట పట్టణంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రి .ఈటెల .కులపోడని, వాడకట్టోడని, ఇంతకుముందు ఓడిపోయాడనే సన్నిభుతి చూపుతూ ఓటేయవద్దని అన్నారు. ఈటల రాజేందర్ .కడుపులో తలపెట్టి అడుగుతున్నా జమ్మికుంట మున్సిపాల్టీలో టిఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను కోరారు.

జమ్మికుంటలో అభివృద్ధంతా తమ హయాంలోనే జరిగిందన్నారు.జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, హుజూరాబాద్, కోరపల్లి రోడ్లను నాలుగు లైన్లుగా మారుస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే జమ్మికుంటను సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గుర్రాలు కట్టే పాకలా ఉన్న జమ్మికుంట జూనియర్ కాలేజీని రాజభవనాన్ని తలపించేలా కట్టించి పేద పిల్లలకు అంకితం చేశానని తెలిపారు.

ఓట్ల కోసం కొన్ని పార్టీల నాయకులు చెప్పే చెప్పుడు మాటలు నమ్మవద్దని కోరారు. విలీన గ్రామాల్లో టాక్స్ లు ఎక్కువ చేస్తామని పుకార్లు పుట్టిస్తారని అది నిజం కాదన్నారు. ప్రచారం లో భాగంగా ఈటల ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. 2008లో రాజీనామా చేసి గెలిచిన తర్వాత అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిని జమ్మికుంటకు మంచి నీళ్లు ఇవ్వమని అడిగితే.మమ్మల్ని గెలిపించని వాళ్లకు నీళ్లెందుకు ఇయ్యాలని అన్నారని చెప్పుకొచ్చారు.

Related posts

విజయవాడలో డిగ్రీ విద్యార్థుల క్రికెట్ టోర్నీ

Bhavani

ఏపిలో మంత్రి కుటుంబానికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

డిమాండ్: వాయిదా కాదు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment