37.2 C
Hyderabad
April 19, 2024 14: 20 PM
Slider శ్రీకాకుళం

ప్రాధమిక పాఠశాలలో ఇక నుంచి మోగుతుంది వాటర్ బెల్

mandasa school

మందస మండలంలోని గెడ్డవూరు గ్రామంలోని పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధుల ఆరోగ్యం కోసం కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు. ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు కె.జయ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ “వాటర్ బెల్” ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ జాతీయ బాలలదినోత్సవం పురస్కరించుకుని ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచినీళ్లు త్రాగటానికి ప్రైమరీ, యూపీ స్కూల్స్ లో 9.30, 11.15, 14.00, 15.15 సమయాలలో పాఠశాలలో “వాటర్ బెల్” మ్రోగుతుందన్నారు. సామాజిక కార్యకర్త సాగురు నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నచిన్న కార్యక్రమాలతో పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చని, ఉదాహరణకు ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అన్నింటిలో వాటర్‌బెల్‌ పథకాన్ని అమలులోకి తెచ్చిందని, తరగతులకు ఇంటర్‌వెల్‌ మోగించేందుకు సరిగ్గా గంటకు ముందు వాటర్‌బెల్‌ మోగిస్తారు. ఆ సమయానికి విద్యార్థులంతా తమతో తెచ్చుకున్న మంచినీటిని తాగాలి. నీరు తాగిన గంట తర్వాత ఇంటర్‌బెల్‌ కొట్టే సమయానికి శరీరంలో ఈ నీరు ప్రవహించి వారిని మూత్రవిసర్జనకు ప్రేరేపిస్తుంది. ఇలా శరీరానికి అవసరమైన నీటిని తాగడంవల్ల దేహంలోని మలినాలన్నీ బయటకు పోతాయి. ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయంలలోని పేరుకుపోయే వ్యర్థాలతోపాటు బ్యాక్టీరియాను కూడా ఈ నీరు బయటకు పంపుతుందని, దీనివల్ల పలు రోగాల నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యాక్రమం లో ఉపాధ్యాయులు ఆర్.వీరాస్వామి, వంక యోగి, సతీష్, పి.సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన కాగ్నిజెంట్ హెడ్

Satyam NEWS

కేసీఆర్ విజ్ఞాన కేంద్రం విద్యార్థుల పాలిట పెద్ద వరం

Satyam NEWS

చెత్తపై పన్ను రద్దు చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి

Satyam NEWS

Leave a Comment