28.7 C
Hyderabad
April 20, 2024 07: 06 AM
Slider సంపాదకీయం

నో అప్పాయింట్ మెంట్ :మొన్న కేసీఆర్ నిన్న జగన్

kcr modi ys

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కార్యాలయంలో ఏం జరుగుతున్నది? అక్కడ ఏం జరుగుతున్నదో మనకెందుకు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం ఆయన అప్పాయింట్ మెంట్ దొరకడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధానిని కలవకుండానే రావాల్సి వచ్చింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధానిని కలవకుండానే వెనుదిరిగారు. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెనుమార్పులు జరుగుతున్నాయి. తెలంగాణ లో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ క్రియాశీలంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో బిజెపికి ఊపు తెస్తున్నారు (పరోక్షంగా).

ఆంధ్రప్రదేశ్ లో అయితే జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షాను, బిజెపి ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని తెగ పొడిగేస్తున్నారు. అక్కడ జన సేన, బిజెపి మధ్య ఎన్నికల నాటికి పొత్తు ఖరారు అవుతుందని అంటున్నారు. జన సేన పార్టీని బిజెపిలో విలీనం చేయాలని కొందరు బిజెపి నాయకులు ప్రతిపాదిస్తున్నారు కానీ అలా జరిగే అవకాశం లేదు.

రెడ్డి, క్రైస్తవులకు వ్యతిరేకంగా కమ్మ, కాపు కులస్తుల కాంబినేషన్ తెరపైకి తీసుకురావాలని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బిజెపి కమ్మ కులానికి, జన సేన కాపు కులానికి ప్రాతినిధ్యం వహిస్తే రానున్న రోజుల్లో కేంద్రానికి ఎంపిలను, రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునే స్థాయిలో ఎమ్మెల్యేలను కైవసం చేసుకోవచ్చని ప్రతిపాదిస్తున్నారు.

 ఇది వైసిపికి చుక్కలు చూపించే అంశమేనని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక లేచే అవకాశం లేనందును బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ దశలో గతంలో చేసిన తప్పిదాలు చేయరాదని బిజెపి అధిష్టానం అనుకుంటున్నది. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రధాని గానీ బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గానీ కలిసేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు.

Related posts

కరెంటు మీటర్ రీడర్స్ కు నిత్యావసరాలు పంపిణీ

Satyam NEWS

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS

Leave a Comment