28.2 C
Hyderabad
April 20, 2024 12: 30 PM
Slider సంపాదకీయం

బతికి ఉంటే కదా మిత్రమా మతాచారాలు పాటించేది?

muslims

కరోనా పై పోరాటం మత కోణంలోకి మారుతున్న ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని అందరూ అడ్డుకోవాలి. ఇది దేశానికి మంచిది కాదు. తబ్లిగీ జమాత్ లో పాల్గొని వచ్చిన వారిని వెతకడం, వారిని క్వారంటైన్ చేయడం ఈ ప్రక్రియ అంతా ఒక మతంపై జరుగుతున్న దాడిగా కొందరు చిత్రీకరిస్తున్నారు.

ఇది మతంపై జరుగుతున్న దాడిగా ఎవరూ అనుకోవడానికి వీల్లేదు. ఇది ఆరోగ్య సమస్య. ఏ హిందూ దేవాలయం వద్దో, క్రిష్టియన్ల పండుగలోనో ఇలాంటిది జరిగినా ప్రభుత్వ యంత్రాంగం ఇదే విధంగా స్పందిస్తుంది. ఆ విషయం తెలుసుకోకుండా కేవలం ఇది ముస్లిం మతంపై జరుగుతున్న దాడిగా చిత్రీకరించడం కేవలం కొందరు స్వార్థపరులు చేస్తున్న విష ప్రచారంగా చూడాలి.

తబ్లిగీ జమాత్ నిర్వహించిన వారు ఎందుకు ఆ సమావేశం ఏర్పాటు చేశారు? అందులో దేశంలోని అన్ని రాష్ట్రాల వారిని ఎందుకు పిలిచారు? వారికి ఏం ఉద్బోధించారు? అనే విషయాలు ఎవరూ అడగడం లేదు. ఎందుకు నిర్వహించినా, ఎవరు నిర్వహించినా అందులో ఏం చెప్పినా ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

అయితే ఆ సమావేశంలో పాల్గొన్న వారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లడం, అక్కడ కరోనా వైరస్ పాకిపోవడం పైనే అందరూ ఆందోళన చెందుతున్నది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇది ముస్లిం మతానికి వ్యతిరేకంగా జరుగుతున్నది కాదు.

ఈ విషయాన్ని పక్కదోవ పట్టించి తమషా చూసే వారిని నిజమైన మత విశ్వాసాలు ఉన్న ముస్లింలు తగిన సమాధానం చెప్పాలి. ముస్లింలో చైతన్యం రావాలి. వారిని వారు కాపాడుకోవాలి. వారి ద్వారా జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలి. అంతే తప్ప ఈ సమయంలో కూడా మతం గురించి మాట్లాడుతూ, కేవలం ముస్లింలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ప్రచారం చేయడం ఏ మాత్రం క్షమార్హం కాదు.

ముస్లింలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నది. తబ్లిగీ జమాత్ కు వెళ్లకుండా ఇంట్లో ఉన్న వారి మహిళలకు కూడా కరోనా వైరస్ వచ్చింది. అంటే దాని అర్ధం ఏమిటి? ఇది వారికే కాదు. సమాజానికి ప్రమాదం. ఈ ప్రమాదాన్ని ముస్లింలు గుర్తించాలి.

మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇతరులను కాపాడండి అని చెప్పడం తప్పు ఎలా అవుతుంది? కరోనా వైరస్ పాకుతుంది కాబట్టి మూడు అడుగుల దూరం పాటించి నమాజు చేయమని చెప్పడం ముస్లిం మతానికి వ్యతిరేకం ఎలా అవుతుంది?

గుంపులు గుంపులుగా ఉండరాదని మసీదులకు వెళ్లవద్దని చెప్పడం ముస్లింలకు వ్యతిరేకం ఎలా అవుతుంది? హిందూ మత కోణంలో దీన్ని చూస్తే మరి ఇప్పటికే జరిగిన ఇంకా జరుగుతున్న విషయాలు ఎవరితో చెప్పుకోవాలి? తిరుపతి నుంచి చిన్న చిన్న దేవాలయాల వరకూ మూసేశారు.

రామనవమి కళ్యాణం ఉత్సవాలు కూడా ఇద్దరు ముగ్గురితో జరుపుకున్నారు. ఇవన్నీ హిందూ వ్యతిరేక చర్యలు అని వాదిస్తూ రోడ్ల మీద ధర్నాలు చేయాలా? మంకుపట్టు పడుతున్న కొందరు ముస్లింలు మారాలి. వారి ఆలోచనా ధోరణి మార్చుకోవాలి. ముస్లింలో ఉన్న డాక్టర్లు ముందుకు వచ్చి వారికి అర్ధం అయ్యేలా చెప్పాలి. ముస్లిం రాజకీయ వేత్తలారా దయచేసి ఈ అంశంలో మీరు జోక్యం చేసుకోవద్దు. మీ రాజకీయాలు మనుషులు బతికి ఉంటే కదా చేసుకోవడానికి. మనుషులను బతికించే వరకూ అయినా మీ రాజకీయాలు కట్టిపెట్టండి. ముందు మనుషుల్ని బతకనివ్వండి.

Related posts

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS

సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే పోతిరెడ్డిపాడు జీవో

Satyam NEWS

ఎంపీడీవో మండల పరిషత్  క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment