28.7 C
Hyderabad
April 20, 2024 05: 26 AM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు: ఇవి మతిలేని కొత్తపలుకులు

ys cbn

రాబోయే ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీని ఎలా బతికించుకోవాలనే ఆలోచన తప్ప ఈ ఎల్లోస్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించడం లేదు. తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలంటే వైసిపిని దెబ్బ కొట్టాలి. వైసిపిని దెబ్బ కొట్టాలంటే అధికారంలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక ముఠా కక్షిదారుడుగా, అనుభవంలేని రాజకీయ వేత్తగా, కేవలం స్వాలాభం కోసం తప్ప వేరే పని చేయని వ్యక్తిగా ప్రొజెక్టు చేయాలి. అదే ఇప్పుడు ఎల్లోస్ చేస్తున్న పని.

చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయిల్ తరహా సేద్యం ప్రయోగాత్మకంగా చేపట్టవచ్చు, శ్రీసిటీ ఏర్పాటు చేయవచ్చు తెలంగాణ సిఎం కేసీఆర్ సిద్దిపేటలో అనూహ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. కానీ జగన్ మాత్రం కడప జిల్లాలో ఫ్యాక్టరీలు పెట్టండి అని అడగడానికి వీల్లేదు. అలా అడిగితే అది తప్పు. ఇదీ ఈ చెత్తపలుకుగాడు ఈ వారం కనిపెట్టిన సత్యం. బీజింగ్ లో జరిగిన సదస్సులో ప్రపంచ పారిశ్రామిక వేత్తలు అందరూ కూర్చుని జగన్ వ్యక్తిత్వం గురించే మాట్లాడుకున్నారు. వారికి ఆ.జ్యో.రా తరహా లోనే వేరే పనులేం లేవు.

కట్ చేస్తే బీజింగ్ లో జరిగిన పరిణామాల గురించి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆలోచిస్తూనే ఉంది. కట్ చేస్తే అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. కట్ చేస్తే…. ఇక కట్ చేయక్కరలేదు. గత ఎన్నికల్లోనే ప్రజలు కట్ చేశారు. అయినా రాజకీయంగా వంద రోజులు కూడా ఉండలేని ఆత్రం ఈ మాటలు మాట్లాడిస్తున్నది. గెలిచినా ఓడినా ఆంధ్రప్రదేశ్ పై హక్కు ఒక్క చంద్రబాబునాయుడు  కే ఉంటుంది….. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తెలుసుకోండి… ఈ ఎల్లోస్ చెప్పిన మాటలు వినండి.

తక్షణమే మళ్లీ ఎన్నికలకు వెళ్లిపోయి ఈ పచ్చ ఫెలోస్ నే గెలిపించండి. వాడెవడో బీజింగ్ సదస్సులో పాల్గొని వచ్చి ఆ.జ్యో.రా కు చెప్పారట. అది కొత్తపలుకులో ప్రతిధ్వనించాడు. ఎక్కడా ఒక్క పేరు కూడా ఉండదు. ఇదీ క్రెడిటబుల్ జర్నలిజం అంటే. జగన్ వ్యవహార శైలిపై అందరూ ఆందోళన చెందుతున్నారు- అయ్యా ఇదీ సంగతి. జగన్ ఏ పని చేసినా వీళ్లు భయపడుతూనే ఉన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కదిలిస్తే చాలు ఎల్లోస్ కు పూనకం వస్తుంది. కేంద్రంలో లాబీయింగ్ చేసుకుని ఒకే లెటర్ కాపీ తీసి ప్రతి పదిహేను రోజులకు ఒక సారి పంపిస్తుంటారు.

లెటర్ వచ్చీ రాగానే సిబి నాయుడు, ఎల్లోస్ ఎగబడతారు. పారిశ్రామికవేత్తలంతా విజయసాయిరెడ్డి దగ్గర చెప్పారట, ఆయన జగన్ వద్ద చెబితే వినలేదట. ఢిల్లీ వెళ్లి పని చేయమన్నాను కదా ఇక్కడి విషయాలు మీకెందుకు అన్నాడట. వామ్మో, ఎల్లోస్ గోడలకు పెద్ద పెద్ద చెవులే ఉన్నట్టున్నాయి. ఇంకో అధికారి పని చేయలేనని చెప్పాడట. ఆ.జ్యో.రా నీవు ఆ పేరు చెప్పగలవా? గోడలు అంటే గుర్తుకు వచ్చింది గ్రామ సచీవాలయాలకు వైసిపి రంగులు వేస్తున్నారట.

మరి అన్నింటికి పచ్చరంగు పులిమినప్పుడు నోట్లో ఏం పెట్టుకుని కూర్చున్నారో. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ఇమేజ్ ని దారుణంగా బజారున పెడుతున్న ఎల్లోమీడియా ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నది. మంకుపట్టు ఉన్న ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అడుగుజాడల్లో నడవాల్సిందిగా ఏపి సిఎం జగన్ కు సూచిస్తున్నట్లుగా కొత్తపలుకు అనుమానిస్తున్నది. అందులో తప్పేంటో సిబినాయుడికి ఆ.జ్యో.రాకే తెలియాలి.

ఈ కొత్తపలుకుగాడు మరో కొత్త విషయం చెప్పాడు- సంక్షేమ పథకాలు ఒక్కటే గట్టెక్కిస్తాయనుకోవడం పొరబాటేనని – నిజమే – స్వీయ అనుభవం కదా. పసుపు కుంకుమ పేరుతో దోచిపెట్టినా ప్రజలు ఛీ కొట్టారు. జగనూ ఒక్క సారి ఆ.జ్యో.రా మాట వినయ్యా, ఎందుకు పేచీ. రెడ్లందరిని దూరం పెట్టి కమ్మని పాలన చెయ్యవచ్చు కదా? నీకు ఎందుకు ఈ మంకుపట్టు?

మరో కొత్త కొ.ప. వెలుగులోకి తెచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడులు జరుగుతున్నాయట. దాన్ని గమనించి ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నదట. ఆ.జ్యో.రాకు తెలియని విషయం ఏమిటంటే నరేంద్రమోడీ తెచ్చిన కొత్త నిబంధనలతో దేశంలో క్రైస్తవ సంఘం నడిచే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చే విరాళాలన్నీ కట్ అయ్యాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మతమార్పిడులు జరిగే అవకాశం లేదు. జగన్ మతం దృష్ట్యా ఇలాంటి వార్తల్ని ప్రచారం చేయడం సులభం.

అయితే వాస్తవంగా ఏపిలో దళితులంతా క్రైస్తవాన్ని వదిలేసి ప్రభుత్వం అమలు చేసే పథకాలు అందుకోవడానికి వస్తున్నట్లుగా ఒక అంచనా ఉంది. దళితులంతా క్రైస్తువులే అనే కొందరు భూ కామందుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బిజెపితో లైను కలిపేందుకు ఆ.జ్యో.రా ఇప్పటికే కొందరు తన తాబేదార్లను బిజెపిలోకి పంపాడు. వెంకయ్యనాయుడికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ఆ.జ్యో.రా కు అమిత్ షాతో లైన్ కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు లైన్ కట్ చూసి ఇటు కలపాలనేది ప్లాన్.

ఇలాంటి వాళ్లను కొన్ని కోట్ల మందిని చూస్తున్న అమిత్ షా వీరి వలలో చిక్కుతాడో లేదో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నారట. ఎవరు? సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే. హమ్మా, ఏం జర్నలిజంరా బాబూ? అమరావతిలో పెట్టుబడులు పెట్టద్దని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడట. ఓ… ఆ.జ్యో.రా… కేసీఆర్ చెప్పిందేమిటి? నీవు రాసిందేమిటి? కేసీఆర్ అసెంబ్లీలో చెప్పింది ఏమిటంటే – అమరావతిలో బిల్డింగ్ లు కట్టడానికి కోట్లు ఖర్చు పెట్టద్దు అది వేస్టు అని. ఆయన వేరే వారికి కాదు చెప్పింది సాక్షాత్తూ సిబినాయుడికే.

దాన్ని వక్రీకరించి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కేసీఆర్ అడ్డుకున్నట్లు రాశాడు. ఎంత వక్రీకరణ? ఇదే విషయం వంద సార్లు చెబుతారు… దాన్నే నిజమని నమ్మిస్తారు. ఇలా చరిత్రను వక్రీకరిస్తూనే ఉంటారు. అందుకే వాళ్లను ఎల్లోస్ అంటున్నది. వీళ్ల రక్తం కూడా పచ్చగానే ఉంటుంది. ఓ సోదరా ఆంధ్రప్రదేశ్ కుక్కలు చింపిన విస్తరి అవుతున్నదన్న ఆందోళన నీకు సహజం. ఎందుకంటే అక్కడ నీ సీబీనాయుడు లేడు కదా.

కృష్ణ గోదావరి జలాలను పంచుకునే విషయాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని సంయుక్త ప్రకటన చేయలేదట. ఇంకా ఒక నిర్ణయానికి వస్తే కదా సోదరా? ప్రకటన చేసేది. అంత తొందర ఎందుకు. కొంచెం ఆగు చెబుతారు. ఇద్దరు సిఎంలు కేంద్రం పై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు రాసేదీ మీరే దాన్ని ఖండిస్తే ఒక్కరే ఖండించారే ఇద్దరూ ఖండించలేదే అని చెప్పేదీ మీరే. మీరు ఏం చేసినా అది నిజాయితీ. ఎదుటివారు ఏం చేసినా అది రాజకీయం.

రాజకీయాలలో నెంబర్ ఎవరిది ఎక్కువ ఉంటే వారి మాటే నెగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మరే రాష్ట్రం అయినా. ఎంపిల నెంబర్ వైసిపికి ఎక్కువ ఉంది. మరి ఎవరు ఎవరి మాట వింటారు? ఇలాంటి చిన్న చిన్న లాజిక్ లను కూడా పచ్చ అద్దం నుంచి చూసి చెప్పడం ఏం జర్నలిజం? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తుతాయట. కొత్తగా తలెత్తేది ఏముంది. సిబి నాయుడు చేసిన రాజకీయంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది.

ఇప్పుడిప్పుడే సమస్యలు సర్దుమణుగుతున్నాయి. కేసీఆర్ ను బూచిగా చూపించి ఓట్లు దండుకుందామనుకున్న వారికి ప్రజలు గుణపాఠం చెప్పి మూడు నెలలు కూడా కాలేదు. ఎందుకయ్యా ఈ మతిలేని కొత్తపలుకులు?

Related posts

ఒకే ఒక్క ఫోన్ తో స్పందించారు ప్రాణం నిలిచింది

Satyam NEWS

ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా ప్రకటించిన WHO

Sub Editor

టిడ్కో లబ్దిదారులకు అన్యాయం చేస్తే ఉద్యమం

Satyam NEWS

Leave a Comment