అందాల శ్రీమతులు ఫ్యాషన్ సోబగులతో మెరిసి మురిసి పోయారు. వెస్ట్రన్, ట్రెడిషనల్ కలెక్షన్స్ లో వయ్యారాల నడకలతో హోయలోలికారు. మాదాపూర్ లోని శిల్పకళావేదికలో జరిగిన రెండు రోజుల ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా చివరి రోజు మిస్సెస్ అర్బన్ ఇండియా గ్రాండ్ ఫినాలే ఆద్యంతం అలరించింది.
34 మంది పోటీపడ్డ మహిళలు తమ వయ్యారాల నడకలతో మోడళ్లను తలపించే విధంగా అదరహో అనిపించారు. వివిధ రంగాల నుండి మహిళలు ఇందులో పోటీ పడ్డారు. పలు అంశాల ఆధారంగా విజేతలను జ్యూరీ సభ్యులు, డిజైనర్లు కొండా కవితా రెడ్డి, సింధు వరగాని, నటి రోహిణి నాయుడు లు ఎంపిక చేశారు.
వీటితోపాటు ప్రత్యేకంగా కిడ్స్ నేషనల్ ఫ్యాషన్ కాంటెస్ట్ కూడా జరిగింది. ఇందులో 87 మంది బాల బాలికలు పాలుపంచుకున్నారు. బుడి బుడి నడకలతో చిన్నారులు అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన ఈ ఫెస్టివల్ కు మంచి స్పందన లభించిందని, ఈ ఫెస్టివల్ మోడలింగ్ రంగంలో రాణించాలని కొనేవారికి మంచి వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.
