కేంద్ర బడ్జెట్ 2025 – 26 సంబంధించిన అంశాల కూర్పు పైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను ఢిల్లీలో కలిసి ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ వినతి పత్రం సమర్పించారు. ఈరోజు పార్లమెంట్ లోని ఆర్ధిక మంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. వినతి పత్రంలో ముఖ్యమైన విషయాలు చూస్తే రాబోయే బడ్జెట్ లో మూలధన వ్యయం కేటాయింపులు 13.50 లక్షల కోట్లు వరకు అవసరం. రాష్ట్రాల మూలధన వ్యయం దీర్ఘకాలిక వడ్డీలేని రుణాల కోసం 2 నుండి 2.50 లక్షల కోట్ల మధ్య కేటాయింపు అవసరం. స్కిల్ సెన్సెస్ కోసం కేంద్ర ప్రాయోజిత పథకం క్రింద ప్రత్యేక కేటాయింపులు కోరడం జరిగింది.
పీఎం గతిశక్తి యోజన అమలు కోసం మరో 10 నుండి 15 లక్షల కోట్లతో రాష్ట్రాలకు మరో అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. “ పూర్వోదయ “ క్రింద 5 రాష్ట్రాలకు కనీసం 50 వేల కోట్ల కేటాయింపుతో పీఎం గతిశక్తి యోజన తరహా కేంద్ర, రాష్ట్ర మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రణాళిక బద్ధంగా కేటాయింపులు అవసరం. అమరావతి, పోలవరం కోసం అందించే సహాయం ఇలాగే కొనసాగాలి. ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా గుర్తించినందుకు ధన్యవాదాలు, మిగతా వెనుకబడిన జిల్లాలకు 7 సంవత్సరాలకు మొత్తం 350 కోట్లు సహాయం చేసిన విధంగా ప్రకాశం జిల్లాకు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు.