ప్రకాశం జిల్లా కొనకనమిట్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. వేగంగా వెళుతున్న తుఫాన్ వాహనం, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు బల్లారి నుండి చీమకుర్తికి తుఫాన్ వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది.
తుఫాన్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతులు కర్ణాటక వాసులు గా గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పొదిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.