29.2 C
Hyderabad
October 13, 2024 15: 53 PM
Slider జాతీయం

టెన్షన్: రేపే కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్

yeddyurappa-resigns-karnataka

కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవి ఉంటుందా ఊడుతుందా అనే ఆసక్తి రేకెత్తించే కర్నాటక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

యెల్లాపూర్, రాణెబెన్నూర్, విజయనగర, యశ్వంత్‌పూర్, మహాలక్ష్మీ లే ఔట్, చిక్కబళ్లాపూర్, కేఆర్ పురం, శివాజీ నగర్, కేఆర్ పేట్, హుణసూర్, అథానీ, కాగ్‌వాడ్, గోఖక్, హోస్కోటే, హిరేకేరూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలలో డిసెంబర్ 5న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

న్యాయపరమైన సమస్యల కారణంగా రాజరాజేశ్వరి నగర్, మాస్కిలలో ఎన్నికలు జరగలేదు. గురువారం జరిగిన పోలింగ్‌లో 80 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈ ఉప ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

కాంగ్రెస్, బీజేపీ 15 స్థానాల్లో, జేడీఎస్ 12, బీఎస్‌పీ 2, ఎన్‌సీపీ ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా అనర్హులని ప్రకటించిన సుప్రీంకోర్టు వారు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి పార్టీ ఫిరాయించిన అనర్హత ఎమ్మెల్యేలంతా బీజేపీ నుంచి బరిలోకి దిగారు.

224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 105, కాంగ్రెస్ 66, జేడీఎస్ 34, బీఎస్పీ 1, ఒక స్వతంత్ర, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉండగా మరో ఎనిమిది మంది కావాలి. 

Related posts

వార్ కంటిన్యూస్: ఇరాక్ అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

Satyam NEWS

లింగాయత్ సమాజ్ నూతన కమిటీ అధ్యక్షుడు గా సంగాయప్ప

Satyam NEWS

1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారoభo

Bhavani

Leave a Comment