పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు ర్యాంకులు, మార్కుల పైనే దృష్టి పెట్టడం సబబు కాదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే మంచి వేదిక అని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, విద్యార్థుల జిజ్ఞాసను తెలుసుకుని వారిని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలని ఆయన అన్నారు.
పాఠశాల స్థాయి నుండే ..ప్లాస్టిక్ నిషేధించాలి.. మొక్కలు నాటాలి అనే ఆలోచన రావాలి… బడిలో నీళ్ల గంట మొగాలి…పిల్లలు రోజుకు కనీసం.. రేపటి తరం తరగతి గదుల్లో తయారవుతాయన్న విషయం ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు.
విద్యతో పాటు గుణవంతులుగా, సంస్కారులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలకు సామాజిక బాధ్యతను నేర్పాలన్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా నీళ్ల గంట కొట్టాలని మంత్రి కోరారు.