28.7 C
Hyderabad
April 25, 2024 04: 36 AM
Slider మహబూబ్ నగర్

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ నోట పధకాల మాట

#President DK

ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కు పథకాలు గుర్తుకొస్తాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ అన్నారు. ఈరోజు జోగులంబా గద్వాల జిల్లా కేంద్రం లోని దరూర్ మండలం లో ర్యాలం పాడు ,మార్ల బీడు,బూరెడ్డి పల్లి ,చెన్న రెడ్డి పల్లి,దరూర్ గ్రామాలలో బిజెపి జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డికె.అరుణ మాట్లాడుతూ కేసీఆర్ పాలన 9 ఏళ్లలో భూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి కనిపించడం లేదని గజం స్థలం సేకరించలేని దద్దమ్మలకు ఓటు అడిగి

హక్కు లేదని ఆమె అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే జరిగిన అభివృద్ధే తప్ప తొమ్మిదేళ్లలో అభివృద్ధి జరిగింది లేదు…ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి జిల్లా సాధించా…లేకుంటే పొద్దున లేచిన వెంబడే భుజాన బ్యాగ్ వేసుకొని పాలమూరుకు బయలుదేరుతుంటిరి. నెట్టెంపాడు ప్రాజెక్టు లేకుంటే ఈ ప్రాంతం ఎడారిగా మారేది అని ఆమె అన్నారు.

గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని, అందులో సిసి రోడ్లు, మధ్యాహ్న భోజన పథకం ,అంగన్వాడీ భవనం, పౌష్టికాహారం, వైకుంఠధామాలు రైతు వేదికలు మొదలైనవి అందిస్తున్నామని ఆమె అన్నారు. 9 సంవత్సరాలనుండి ఎన్ని ఇండ్లు పట్టణంలో కట్టారో రెండు పడకల గదుల ఎన్ని నిర్మాణం చేసారో నివేదికలు

తెలియజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ కాలేదని,కేసీఆర్ కుటుంబం, మీ కార్యకర్తలు మాత్రమే బంగారు తెలంగాణగా మారిందన్నారు. పేదలకు న్యాయం జరగాలని జిల్లా ఉద్యమం చేసి జిల్లా సాధిస్తే ఈ ప్రాంతనికి అభివృద్ధికి బాటలవేసే జిల్లా అధికారులను ఇబ్బందులకు గురి చేసి వెళ్లగొట్టిన ఘనత నేటి బిఆర్ ఎస్ నాయకుల

తీరన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ధమనీయంగా మారడంతో పాటు గ్రామీణ రోడ్లు మరీ ఆధ్వనంగా ఉన్నాయాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్

రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, మండల అధ్యక్షుడు రాజేష్ అయ్యా, బిజెపి సీనియర్ నాయకులు మిర్జాపురం రామచంద్ర రెడ్డి, మీర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,నరేందర్ రెడ్డి, మార్లబీడు జనార్దన్, దరూర్ కిష్టన్న, దరూర్ శ్రీకాంత్ రెడ్డి, రామన్న,నరసింహ తదితరులు ఉన్నారు.

Related posts

చదువుకుంటేనే జీవితానికి రాణింపు: ఎంపీ ఆదాల

Bhavani

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

Satyam NEWS

ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి

Satyam NEWS

Leave a Comment