దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష జరిపారు. సహాయ కార్యక్రమాలకోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన మంత్రులకు, అధికారులకు ఆదేశం ఇచ్చారు.
previous post