28.2 C
Hyderabad
April 20, 2024 12: 06 PM
Slider ముఖ్యంశాలు

ఎకరాకు 10వేలు

#cm

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు తాము అండగా  వుంటామని , ముందుగా నష్ట పోయిన వారందరికి ఏకరాకు 10 వేల రూపాయలు పరుహారం ఇస్తామని, తొలి దశగా 228 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు  ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సహాయoగా వుంటున్న ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సీఎం గురువారం పరిశీలించారు.  పంట నష్టం పై కేంద్రానికి నివేదిక ఇవ్వమన్నారు. గతంలో ఇచ్చిన వాటికే ఇంతవరకు పరిహారం అందలేదని, ఇప్పుడు మరోసారి ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమి లేదని , అందుకే తమ రైతులను తామే ఆదుకుంటామని  చెప్పారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం ప్రవేశ పెట్టాల్సి ఉందని, ఎన్డీయేకు రాజకీయాలు తప్ప రైతుల వెతలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , కలెక్టర్ గౌతమ్ పంట నష్ట వివరాలను సి‌ఎం కు వివరించారు. తొలుత ఆయన ఏరియల్ సర్వే ద్వారా  పంట వష్టాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడి పెట్టుబడి, నష్టం, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వెంటనే నష్టంపై సర్వే చేయాలని ఆదేశాలు చేశారు. గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,  మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు.

ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారని, అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారన్నారు.  వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారని,  ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారని,  కానీ తాము మాత్రం  తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని గర్వంగా చెపుతామన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉందన్నారు. జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉందని,  కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉందని, సరాసరిగా 16 శాతం వరకు ఉందని కేసీఆర్‌ తెలిపారు. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. భారతదేశానికే కొత్త అగ్రికల్చర్‌ పాలసీ కావాలి. దానిని తాము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉందని, వాళ్లకు రాజకీయాలు తప్ప ప్రజల్లేరు, రైతులు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దని,  ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని,  తెలియక దీన్ని చాలామంది నష్టపరిహారం అని అంటారు. కానీ వీటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలన్నారు. మంత్రులు  పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సభర్వాల్, సి‌పి‌ఎం, సి‌పి‌ఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, వుమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

జైలు నుంచి విడుదలైన టీడీపీ నేతకు సంఘీభావం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లా నేర స‌మాచారం క్రైమ్ ఫ‌టాఫ‌ట్..ఓ సారి చూడండి !

Satyam NEWS

రాజయ్య కడియం మధ్య రాజీ

Bhavani

Leave a Comment