36.2 C
Hyderabad
April 24, 2024 20: 42 PM
Slider ముఖ్యంశాలు

11 మంది సజీవదహనం

11 people cremated alive

హైదరాబాద్ నగరంలోని బోయగూడలో తెల్లారుఘమున సంభవించిన  భారీ అగ్నిప్రమాదం లో 11 మంది సజీవదహనం అయ్యారు.   టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 11 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో టింబర్‌డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్‌డిపోతో పాటు, స్క్రాప్‌ గోదాం కూడా ఉంది. టింబర్‌ డిపో నుంచి స్క్రాప్‌ గోదాముకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తున్నది. పోలీసు  అగ్ని మాపక అధికారులు సంఘటనా స్థలనికి చేరుకుని పరిస్తితిని అదుపులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఘటనా స్థలం కు చేరుకుని పోలీసు విచారణకు ఆదేశాలు జారీచేశారు.

Related posts

అసాంఘిక కార్యకలాపాలకు సీసీ కెమెరాలతో చెక్

Satyam NEWS

సీపీఎం కార్యాలయం లో చొరబడి నేతలను అరెస్టులు చేసిన ఖాకీలు..!

Satyam NEWS

గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు

Murali Krishna

Leave a Comment