సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే వయసు ఎంత ఉండాలి? వయసుతో పనేంటండీ? నన్ను చూడండి అంటున్నాడీ బుడతడు. 12 ఏళ్ల ప్రాయంలోనే పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో డేటా సైంటిస్టుగా చేరిపోయాడు ఇతడు. హైదరాబాద్ మణికొండలో నివాసం ఉండే 12 ఏళ్ల పి.రాజ్ కుమార్ ఈ ఘనత సాధించాడు. కేప్ జెమినీ కంపెనీలో ఇతను డేటా సైంటిస్టుగా పని చేస్తున్నాడు. వారానికి మూడు రోజులు స్కూల్ కు వెళతాడు. మరో మూడు రోజులు ఉద్యోగం చేస్తాడన్నమాట. అలా ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటాడు రాజశేఖర్. తల్లీతండ్రీ సహకారంతో తాను ఈ విధమైన ఫలితాన్ని సాధించినట్లు రాజకుమార్ అంటున్నాడు. రాజకుమార్ తల్లిదండ్రులు గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించిన వారు. నేడు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కలిసి తన అప్పాయింట్ మెంట్ చూపించారు. పిల్లాడు సాధించిన ఈ ఘనతకు మంత్రి అభినందించారు.
previous post