28.7 C
Hyderabad
April 25, 2024 03: 28 AM
Slider ఖమ్మం

19 నుండి మున్నూరు కాపు చైతన్య యాత్ర

#munnurukapu

రాష్ట్రంలో మున్నూరు కాపు కులస్తులను చైతన్యం చేసేందుకు ఈ నెల 19నుండి  వేములవాడ నుండి  చేపట్టే మున్నూరుకాపు చైతన్య యాత్రను జయప్రదం చేయాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరావు పిలుపునిచ్చారు.  స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 54శాతం కలిగిన బిసి కులాలలో 23శాతం కలిగి ఉన్న మున్నూరుకాపులను రాజకీయంగా, ఉద్యోగ పరంగా చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లలో తమ  వాటా ప్రకారం తమకు కావాలని అన్నారు. డిసెంబర్ 19న వేములవాడ నుండి 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో ఒకే రకమైన ఉత్సాహంగా మున్నూరుకాపులను ఒక శక్తిగా మార్చడానికి యాత్ర చేస్తున్నామన్నారు. అదే శక్తితో ఐదు లక్షల మందితో రాజకీయాల కతీతంగా హైదరాబాదులో గర్జన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రాజకీయపరంగా దామాషా ప్రకారం మున్నూరు కాపులకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలలో మున్నూరుకాపు కులస్తులు చైతన్యంగా ఉన్నారని గుర్తు చేశారు. మున్నూరు కాపులకు జిల్లాకొక ఎమ్మెల్యే ఇవ్వాలని అన్నారు. ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 వేల కోట్లతో మున్నూరుకాపు కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి మున్నూరుకాపుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఒకే కులం ఒకే సంఘం పేరుతో మున్నూరుకాపులు గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేసి మున్నూరుకాపు చైతన్య యాత్రను విజయవంతం చేయాలని, అదే స్ఫూర్తితో హైదరాబాదులో నిర్వహించే గర్జన సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి దేవేందర్, కేదాస్ నరసయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపట్ల మురళి, కొత్తా లక్ష్మణ్, మేకల బిక్షమయ్య, మరిశెట్టి వెంకటేశ్వరావు, ఉపాధ్యాయుల సూర్యప్రకాష్ రావు, టౌన్ అధ్యక్షులు మాడూరి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నీలోఫర్ లో చికిత్స పొందుతూ కరోనాతో బాలుడు మృతి

Satyam NEWS

మహా పాదయాత్ర: ఉత్తరాంధ్ర ప్రజలకు వ్యతిరేకత ఉందా?

Satyam NEWS

ఓ మహాయోగి

Satyam NEWS

Leave a Comment