అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం గాంధీ బొమ్మ సమీపంలోని ఏకే జ్యువెలరీ షాప్ లో ఇద్దరు టక్కరి మహిళలు నకిలీ బంగారాన్ని ఇచ్చి అసలు బంగారాన్ని కొని యజమాని ఇబ్రహీంను బురిడీ కొట్టించారు. జ్యువెలరీ షాప్ కు వచ్చిన ఇద్దరు మహిళలు అసలు బంగారానికి దీటుగా ఉన్న నకిలీ బంగారాన్నీ నమ్మకం గా బేరం పెట్టారు. ఇందుకు ప్రతిఫలంగా దుకాణంలో ఉన్న ఒక లక్షా 50 వేల విలువ చేసే బంగారు నగలు కొనుగోలు చేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత బంగారాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించిన యజమాని ఇబ్రహీం అది నకిలీ బంగారం అని తేలడంతో లబోదిబోమన్నాడు. ఘటన జరిగి రెండు రోజులైనా సమస్యకు పరిష్కారం దొరకపోవడంతో మంగళవారం పోలీసులు ఆశ్రయించారు. దుకాణంలో ఉన్న సిసి ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు.
previous post