31.7 C
Hyderabad
April 25, 2024 00: 33 AM
Slider మహబూబ్ నగర్

కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్నిఏర్పాటు చేయాలి

kovid

వనపర్తి జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా మొదటి విడత డాక్టర్లు, నర్సులు, అంగన్వాడి, ఆశ కార్యకర్తలందరికి వ్యాక్సిన్ ఇస్తామ‌న్నారు.

తర్వాత పోలీస్, ఆర్మీ, మున్సిపల్, పంచాయతీరాజ్ వర్కర్లు తదితరులకు ఇస్తామ‌న్నారు. ఆ తర్వాత ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తారని, ఇందులో కూడా యాభై సంవత్సరాలు పైబడినవారు, 50 సంవత్సరాల లోపు ఉన్నవారిని గుర్తించి వర్గాలుగా విభజించి వ్యాక్సిన్ ఇస్తామ‌ని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్నిప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు గుర్తించాలని, వ్యాక్సిన్ ఇచ్చే ప్రతిచోటా ఒక వెయిటింగ్ రూం, వ్యాక్సిన్ రూము, అదేవిధంగా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పరిశీలన చేసేందుకు అబ్జర్వేషన్ రూంలను ఏర్పాటు చేయాలని, వ్యాక్సిన్ ఉంచే గదులకు 24 గంటలు విద్యుత్తు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకుగాను చెక్ లీస్ట్ ను రూపొందించి సౌకర్యాలపై నిర్ధారణ చేసుకోవాలని ఆదేశించారు.

అదే విధంగా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే అలాంటివారిని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సులు, ఇతర మందులను ఏర్పాటు చేయాలని, ఇందుకు జిల్లా ఆస్పత్రిలో కూడా అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన ప్రతి ఒక్కరికి గుర్తుగా పోలియో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత గుర్తు పెట్టేలా గుర్తు వేయాలని అని తెలిపారు. దివ్యాంగులు, నడవలేనివారి కోసం వ్యాక్సిన్ కేంద్రాలలో వీల్చైర్ లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గుర్తించిన వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె ప్రజలకు తెలియజేశారు.
వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ రెండవ దశను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ఆమె కోరారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు క్వారంటైన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. జనవరి 2021లో వ్యాక్సిన్ ను ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం ఉన్నందున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తించి వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి కోవిడ్ పంపిణీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కోసం ఒక యాప్ ను రూపొందించనుందని, ఈ యాప్ ద్వారా కూడా ప్రజలు వ్యాక్సినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అయితే దరఖాస్తు చేసుకునెందుకు ఇంకా ఆదేశాలు జారీ చేయనందున ఆదేశాలు వెలువడిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు పూర్తయిన తర్వాత సిబ్బంది ఎక్కువగా ఉండే డి పి ఓ, డి ఆర్ డి ఓ ఇతర ముఖ్యమైన శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆయా శాఖల అధికారులు చేయాల్సిన బాధ్యతలు, విధులు వారి పాత్రపై స్పష్టంగా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జనవరి నాటికి గుర్తించిన అన్నివ్యాక్సిన్ కేంద్రాలలో సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.

ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ రవిశంకర్, సంబంధిత జిల్లా శాఖల అధికారులు హాజరయ్యారు.

Related posts

ఇంటి నిర్మాణాలకు ఐదులక్షలు ఇవ్వాలి

Sub Editor 2

ఆర్మూర్ లో 35 కుటుంబాలకు నిత్యావసరాలు

Satyam NEWS

కేంద్ర సమాచార శాఖ పరిధిలోకి ఆన్ లైన్ కంటెంటు

Satyam NEWS

Leave a Comment