27.7 C
Hyderabad
April 20, 2024 01: 05 AM
Slider ప్రత్యేకం

కావాల్సినంత వ్యాక్సిన్ వస్తుంది.. ఆగస్టు వరకూ ఆగండి

#coronavaccine

కరోనా వ్యాక్సిన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ప్రాణాలు కాపాడుకునేదెలా అని ఆలోచిస్తున్నారా? అలాగే మరో ఐదు నెలలు ఆగండి మీకు అడిగినంత వ్యాక్సిన్ దొరుకుతుంది అంటున్నది మన కేంద్ర ప్రభుత్వం.

రాబోయే ఆగస్టు డిసెంబర్ నెలల మధ్య రెండు కోట్ల 16 లక్షల వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని నీతీఆయోగ్ సభ్యుడు వి కె పాల్ తెలిపారు. రష్యా కు చెందిన స్పూత్నిక్ వ్యాక్సిన్ కూడా వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానున్నదని ఆయన తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ కు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లను పిలిచాయి.

దేశీయంగా వ్యాక్సిన్ ను అప్పటికప్పుడు తయారు చేయలేమని, అందుకు సమయం పడుతుందని పాల్ తెలిపారు. ఆగస్టు డిసెంబర్ మధ్య కాలంలో కోవిషీల్డ్ 75 కోట్ల డోసులు, కోవాక్సిన్ 55 కోట్ల డోసులు విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

బయోలాజికల్ ఇ కంపెనీ నుంచి 30 కోట్ల డోసులు, జైడస్ కాడిలా నుంచి 5 కోట్ల డోసులు, సీరం ఇన్ స్టిట్యూట్ నుంచి 20 కోట్ల డోసులు (నోవావ్యాక్స్) భారత్ బయోటెక్ 10 కోట్ల ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్, జనోవా 6 కోట్ల డోసులు, స్పూత్నిక్ 15.6 కోట్ల డోసులు అందుబాటులో ఉంచుతాయని ఆయన వెల్లడించారు.

బయోలాజికల్ ఇ, కాడిలా, జనోవా, భారత్ బయోటెక్ లు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ ను రూపొందిస్తున్నాయని, ఇవి మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ లో ఉన్నాయని ఆయన తెలిపారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీ

Satyam NEWS

సంప్రదాయ సిద్ధంగా నమ్మాళ్వారుల సేవా కార్యక్రమాలు

Satyam NEWS

పానగల్ మండలంలో స్వీట్లు పంచిన కాంగ్రెస్ యూత్

Satyam NEWS

Leave a Comment