34.2 C
Hyderabad
April 23, 2024 12: 23 PM
Slider ప్రపంచం

కరోనా వ్యాక్సిన్ తో నార్వేలో 23 మంది మృతి

#Norvey

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది మరణించిన దారుణ సంఘటన యూరప్ దేశమైన నార్వేలో జరిగింది. చనిపోయిన వారిలో 13 మరణాలను మాత్రం కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టు కారణంగానే జరిగినట్లు ధృవీకరించారు.

 చనిపోయిన 13 మంది ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న వ్యక్తులే కావడం గమనార్హం. వీరిలో 80 సంవత్సరాలకు పైబడిన వారు కూడా ఉన్నారు.

వీరంతా ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. దాంతో తీవ్ర సైడ్ ఎఫెక్టులు రావడంతో మరణాలు సంభవించాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో జ్వరం రావడం దాంతో తల తిరగడం జరుగుతున్నది.

ఈ కారణాలతో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మరణిస్తున్నారు. న్యూయార్క్ పోస్టు ఈ మరణాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

నార్వే మెడిసిన్ ఏజెన్సీ చీఫ్ ఫిజిషియన్ ఈ మరణాలను ధృవీకరించారని న్యూయార్క్ పోస్టు వెల్లడించింది. గత నెల రోజులుగా ఫైజర్ లేదా మొడెర్నా కంపెనీల వ్యాక్సిన్ ను నార్వేలో సరఫరా చేస్తున్నారు.

ఇప్పటి వరకూ మొత్తం 30 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.  

Related posts

ఇంగ్లీష్ మీడియం బోధనే ఉంటుంది…మారదు

Satyam NEWS

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

ప్రయాణీకులు ఆదరణ పొందడానికి ప్రయత్నించాలి

Satyam NEWS

Leave a Comment