39.2 C
Hyderabad
March 29, 2024 15: 24 PM
Slider మహబూబ్ నగర్

దేశంలో 24గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ

#ministerNiranjanReddy

దేశంలో  24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లా  కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో నిర్మించిన 33/11 కెవి.విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో   దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పాల్గొనగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఉచితంగా,ప్రజలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

జిల్లాలో వివిగా సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడం వల్ల లో వోల్టేజ్ తగ్గించవచని అన్నారు. నిరంతరాయంగా విద్యుత్ వల్ల పంటలు బాగా పండుతాయని అన్నారు.అనంతరం అమడబాకుల,అప్పరాల గ్రామాలలో రైతు వేదిక,పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు.

అలాగే అమడబాకుల గ్రామంలో 3.92  కోట్లు తో జాతీయ రహదారి నుండి అమడబాకుల మీదుగా భూత్కూర్ ,పుల్లారెడ్డి కుంట షుగర్ ఫ్యాక్టరీ వరకు బిటి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.  అనంతరం కొత్తకోట మండలం పామాపురం గ్రామం లో రెండు పడక గదుల వెళ్ళను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి 56 ళ్ళతో  మంచి కాలనీగా రూపుదిద్దుకుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు వ్యవసాయం ఆధారంగా అనేక గ్రామాలలో బ్రతుకుతున్న మని రైతుబంధు ద్వారా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు

రైతులు సాధ్యమైనంత వరి పంట సాగు ను తగ్గించి ఇతర కమర్షియల్ పంటలు గానే పప్పు దినుసులు లాంటి పంటలు సాగుచేసి లాభాలు పొందవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా  డి సి సి బి  డైరెక్టర్ &కొత్తకోట సింగల్ విండో చైర్మన్ కొట్టం వంశీధర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ బాల్ నారాయణ ,వనపర్తి జిల్లా పరిషత్  వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మండల పరిషత్ అధ్యక్షురాలు గుంత మౌనిక, సి.డి.సి చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో ఈనెల 10న‌ సీతారాముల క‌ల్యాణం..!

Satyam NEWS

రాజధాని మార్పుపై నరసరావుపేటలో భారీ ర్యాలీ

Satyam NEWS

నేరాలకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు సాగాలి

Satyam NEWS

Leave a Comment