తిరుమల తిరుపతి దేవస్థానాలకు 25 మందితో కూడిన పాలక మండలిని ఖరారు చేశారు. గతంలో 19 మంది పాలక మండలి సభ్యులు ఉండే వారు కాగా ఆ సంఖ్యను 25కు ప్రభుత్వం పెంచింది. సభ్యులుగా ఖరారైన వారిలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కోటాలో భూమన కరుణాకర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావు, మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి, సుబ్బారావు, జంగా కృష్ణ మూర్తి లను సభ్యులుగా నియమించినట్లు తెలిసింది.
previous post
next post