చదువు చెప్పాల్సిన విద్యార్ధి కి ప్రేమపాఠాలు చెప్పి ఓ మైనర్ బాలున్ని లేవదీసుకు పోయింది ఓ టీచర్. ఇరవై ఆరేళ్ల టీచర్ పద్నాలుగేళ్ల విద్యార్థితో ఉదాయించిన సంఘటన గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగింది.విస్తుగొల్పిన ఈసంఘటన పై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పాఠాలు చెప్పాల్సిన టీచర్ 8 వ తరగతి చదువుతున్నతన కొడుకుని మాయమాటలతో బుట్టలో వేసుకుని తమ నుంచి
దూరంగా తీసుకుపోయిందన్నారు.గత నాలుగురోజులుగా తన కొడుకుతోపాటు టీచర్ కూడా కనిపించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ఆ బాలుడితో సదరు టీచర్ సంవత్సరం పాటు సన్నిహితంగా ఉంతుందని మందలించామని స్కూల్ యాజమాన్యం తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన టీచర్, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.