వేములవాడ పట్టణంలోని మూల వాగుపై నిర్మాణ దశలో ఉన్న రెండో బ్రిడ్జి పాక్షికంగా కూలింది. రూ.28 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణపు పనులు నాసిరకం గా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. 4 ఏళ్లుగా ఈ నిర్మాణపు పనులు కొనసాగుతుండగా మొదటి బ్రిడ్జ్ ని పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడం తో ఈ నిర్మాణపు పనులు మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలతో మూలవాగు లో వర్షపు నీటి ప్రవాహం ఉదృతంగా కొనసాగుతున్నది. ఈ ప్రవాహం మూలంగా పాక్షికంగా గా కృంగి .. మధ్యలో కూలింది.కూలిన బ్రిడ్జ్ ను చూడడానికి ప్రజలు బారులు తీరుతున్నారు.
previous post
next post