35.2 C
Hyderabad
April 24, 2024 12: 32 PM
Slider ఖమ్మం

ఖమ్మం లో రూ.36 కోట్లతో ఐటి హబ్ రెండో దశ

#Minister KTR

ఖమ్మం లో రూ.36 కోట్లతో నిర్మించనున్న 2వ దశ ఐటీ హబ్ (IT Tower) నిర్మాణ పనులకు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, R&B మంత్రి వేముల ప్రశాంతరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ నుండి 48వ డివిజన్లలలో రూ.30 కోట్లు SDF నిధులతో సిసి, బిటి రోడ్ల పునరుద్ధరణ పనులు కూడా మంత్రులు ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ నుండి వివి పాలెం వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న ఫోర్ లైన్(BT) రోడ్డు విస్తరణ పనులకు వారు శంకుస్థాపన చేశారు.

అదే విధంగా ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో ఒకే సముదాయంలో 1000 పేదల డబుల్ ఇళ్లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని 45వేల నూతన కనెక్షన్లు, 85వేల పాత కనెక్షన్స్ ద్వారా ప్రతి రోజు ఇంటికి మంచినీటి సరఫరను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,  ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, TSIIC చైర్మన్ బాల మల్లు, MD మనోహర్ రెడ్డి, ఐటీ హబ్ కోఆర్డినేటర్ ల్యాక్ చెపురి, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ తదితరులు ఉన్నారు.

Related posts

ఏప్రిల్ 1న ‘పరీక్షా పే చర్చ’

Sub Editor 2

ముస్లిం సోదరులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

ప్రైవేట్ వాహనాల కు భలే గిరాకీ

Satyam NEWS

Leave a Comment