పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకునేదెవరు? ఇది ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న. అదెక్కడో చూద్దాం. ఏలూరు జిల్లా లింగపాలెం కామవరపు కోట మండలాల సరిహద్దుల మధ్య వందేళ్ల నాడు నిర్మించిన వంతెన కుంగి శిథిలమైంది. ఈ వంతెన రెండు మండలాల మధ్య ప్రజా సంబంధాల వారధిలా సేవలందించి శత వసంతా లు పూర్తి చేసుకుంది. గత పదేళ్ల లోపు వచ్చిన వరదలకు ఈ వంతెన పునాదులు కదిలిపోయి మూడు ముక్కలై ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన తూఫాన్ వల్ల మూడు రోజుల పాటు పడిన భారీ వర్షాలకు వంతెన పై భాగం కూడా కుంగి కొట్టుకు పోయింది. మారి కొద్దిరోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు, బందువులు రాక పోకల హడావుడి, కోడి పందాల జోరు, మద్యం బాబులు మతి తప్పి మద్యం మత్తు లో వాహనాలు మితి మీరిన వేగం తో నడిపేటపుడు అదుపు ఈ వంతెనపై ఏర్పడిన ప్రమాదపు గొయ్యి లో చీకటి చాటున పడి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే అంటూ ఈ వంతెన పై ప్రయాణించే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న ఈ వంతెన మార్గాన్ని మూసివేసి అత్యవసర ప్రత్యామ్నాయ అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లింగ పాలెం, కామవరపు కోట మండలాల ప్రజలు కోరుతున్నారు.