చిన్న గొడవే పెద్దగా మారింది.ఒకే వర్గానికి చెందిన సిక్కు మతస్తులు రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు కత్తులతో దడి చేసుకున్నారు ఫలితంగా లండన్‌లో ముగ్గురు సిక్కులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్టు లండన్ పోలీసులు తెలిపారు.
ఈ గొడవలు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఓ వర్గం వ్యక్తులు మరో వర్గంపై కత్తులతో దాడికి దిగారు.ముగ్గురు సిక్కులు దాడుల్లో తీవ్రంగా గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. వారి వయసు 20-30 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పిన పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.