36.2 C
Hyderabad
April 25, 2024 20: 59 PM
Slider మహబూబ్ నగర్

ఉంగలం తిరుమల్ ఆధ్వర్యంలో 33వ వార్డు ప్రజల సందర్శన

#wanaparthy

వనపర్తిలోని 33వ వార్డు వాసులు, టీఆర్ఎస్ శ్రేణులు మాజీ కౌన్సిలర్ తిరుమల్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలను చూశారు. తెలంగాణ ప్రభుత్వంచే వనపర్తి శాసనసభ్యుడు- రాష్ట్ర మంత్రి నీళ్ల నిరంజన్ రెడ్డి ద్వారా చేపట్టిన చారిత్రాత్మక అభివృద్ధి పనులను చూడటానికి టిఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ ఆధ్వర్యంలో ప్రజలను తీసుకెళ్ళారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న మహత్తరమైన అభివృద్ధి పనులను  కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయ సముదాయం, నూతనంగా నిర్మాణం అవుతున్న నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, 80 ఫీట్ల వెడల్పు బైపాస్ రోడ్డు, అన్నీ చూసి 33వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అహర్నిశలు శ్రమిస్తూ దీనికి కృషిచేసిన మంత్రి  నీళ్ళ నిరంజన్ రెడ్డికి  ధన్యవాదాలు, కృతజ్ఞతలు  తెలిపారు.

వారు చేస్తున్న కృషి ముందు చూపు వల్ల  భావితరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు శాశ్వతంగా వనపర్తి ప్రజల మనసుల్లో నిలిచిపోతాయని ఉంగలం తిరుమల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ టౌన్ ఉపాధ్యక్షుడు  యం. నీలస్వామి,  సోషల్ మీడియా  అధ్యక్షుడు సునీల్ వాల్మీకి, 33వ వార్డు టిఆర్ఎస్ అధ్యక్షుడు సి. రాములు  ప్రజలు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

Satyam NEWS

కరీంనగర్ లో 27న  లక్ష మందితో ప్రధాని మోడీ బహిరంగ సభ

Satyam NEWS

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

Satyam NEWS

Leave a Comment