30.7 C
Hyderabad
April 23, 2024 23: 28 PM
Slider జాతీయం

రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. 34 మందికి ఆస్వస్థత..

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్‌నాథ్ పట్టణంలోని ఒక పారిశ్రామిక యూనిట్‎లో రసాయన వాయువులు లీకయ్యాయి. దీంతో 34 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. లీకేజీతో కర్మాగారం సమీపంలో నివసించే అనేక మంది ప్రజలు శ్వాసకోశ ఇబ్బంది, కళ్ల మంటలు, వికారం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు.

అంబర్‌నాథ్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యూనిట్‌లో సల్ఫ్యూరిక్ యాసిడ్ లీక్ అయింది. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి హాని లేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

ఆగస్టు 15 కల్లా బేస్ బెంట్ స్థాయి వరకూ పూర్తి కావాలి

Satyam NEWS

ఇక భౌతిక దూరం పాటిస్తూ బతకాల్సిందే

Satyam NEWS

పాకిస్తాన్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు?

Satyam NEWS

Leave a Comment