జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు రద్దు చేసే 370 ఆర్టికల్ రద్దు బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో టెలిఫోన్ లో మాట్లాడారు. ఇందుకు ఆయా సీఎంలు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే BSP, అన్నాడీఎంకే మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. PDP పార్టీ కి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో వారిని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ సభను వాకౌట్ చేయగా.. బిల్లును JDU వ్యతిరేకించింది. జమ్మూ కశ్మీర్ 370, 35A ఆర్టికల్స్ ను రద్దు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించగా.. విపక్షాలు తీవ్ర నిరసనను చేపట్టాయి. ఇందులో భాగంగా… జమ్మూ కశ్మీర్ లోని మెహబూబా ముఫ్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభ లో తీవ్ర గందరగోలం చేయడంతో సభ నుంచి బయటకు పంపివేశారు. ఒకరు నజీర్ అహ్మద్ లావే కాగా, మరొకరు ఎంఎం ఫయాజ్. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులకు నిరసనగా PDP MP నజీర్ అహ్మద్ తన కుర్తాను చింపుకున్నారు.
previous post