32.2 C
Hyderabad
April 20, 2024 19: 00 PM
Slider జాతీయం

రాజోరి జిల్లాలో తెగబడ్డ ఉగ్రవాదులు: నలుగురి మృతి

#rajouri

జమ్మూ డివిజన్‌లోని రాజోరి జిల్లా డాంగ్రీ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక చిన్నారితో సహా నలుగురు పౌరులు మరణించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. డాంగ్రీ ప్రాంతంలో 24 గంటల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన. ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు పౌరులే  లక్ష్యంగా దాడులు చేశారు. 2023 సంవత్సరం మొదటి రోజు సాయంత్రం, నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న రాజోరి జిల్లా డాంగ్రి గ్రామంలో ఇద్దరు ముసుగులు ధరించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలు కాగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఉదయం ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా డాంగ్రీ ప్రధాన కూడలిలో మృతదేహాలను ఉంచి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు బాధిత కుటుంబాలకు సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజోరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను, ఎస్‌ఎస్‌పీని కూడా బదిలీ చేయాలని కొందరు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

డాంగ్రి గ్రామం జిల్లా జైలు సముదాయానికి సమీపంలో ఉంది. గ్రామం కొంచెం ఎత్తులో ఉండడంతో పాటు ఇళ్లు కూడా ఒకదానికొకటి కొంత దూరంలోనే ఉన్నాయి. అయితే సుమారు రెండు వారాల్లో రెండు పెద్ద సంఘటనలు జరిగిన తీరు భద్రతా సంస్థలపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ దాడి మొత్తం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతుందని డాంగ్రీ సర్పంచ్ ధీరజ్ శర్మ అన్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ అటవీ ప్రాంతం ఉగ్రవాదుల కదలికలకు మార్గంగా మారింది.

నౌషెరా ప్రాంతం నుంచి చొరబడిన ఉగ్రవాదులు సరను పోతా అటవీప్రాంతం, పక్కనే ఉన్న కాంగ్, బుధాల్ మీదుగా కలకోట్‌కు చేరుకునేవారు. సున్నిత ప్రాంతం కావడంతో ఈ అడవి లో రహదారిని చాలాసార్లు పునర్నిర్మించారు. మృతులను డాంగ్రీకి చెందిన దీపక్ కుమార్ (23), సతీష్ కుమార్ (45), అక్ష్మాన్, ప్రీతమ్ లాల్ (56)గా గుర్తించారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తొలుత ఆధార్ కార్డు చూసేందుకు ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఈ దాడికి బాధ్యులమని TRF ప్రకటించింది.

Related posts

కోట్లు కొల్లగొడుతున్న వి ఆర్ ఓ కు ఉన్నతాధికారుల అండ?

Satyam NEWS

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

ప్రజల భద్రతకు భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం

Murali Krishna

Leave a Comment