29.2 C
Hyderabad
September 10, 2024 16: 25 PM
Slider జాతీయం

కొండ చరియలు విరిగిపడి 42 మంది మృతి

#landslide

కేరళలోని వయనాడ్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 42 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శిధిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

‘వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఘటన తీవ్రంగా కలిచివేసింది. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారందరికీ, అలాగే గాయపడినవారి కోసం నా ప్రార్ధనలు’ అని పేర్కొంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడంలో భాగంగా రెస్క్యూ ఆపరేషన్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్‌తో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీసి.. కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై కూడా భరోసా ఇచ్చారు ప్రధాని మోడీ. అంతేకాక కేంద్రం తరపున చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు.

Related posts

ఫైరింగ్ :జమ్మూలోఎన్‌కౌంటర్‌ హిజ్బుల్ఉగ్రవాది హతం

Satyam NEWS

బాలికా విద్యపై కళాజాత ప్రదర్శన విజయవంతం

Satyam NEWS

సిఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

Bhavani

Leave a Comment