36.2 C
Hyderabad
April 25, 2024 21: 53 PM
Slider ముఖ్యంశాలు

కొత్త ఏడాది తొలి రోజు మందుకే రూ.430 కోట్లు ఖర్చు

new year begining

న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే మాటలా? అక్షరాలా ఒక్క మందు 430 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇవి కాకుండా మిగిలిన ఖర్చులు కూడా లెక్కేస్తే… అమ్మో వద్దులే మందు వరకే పరిమితం అవుదాం. ఇయర్ ఎండ్ రోజు వైన్స్ దగ్గర రష్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఒకరోజు ముందుగానే మందు కొనేసి పెట్టుకున్నారు.

దీంతో డిసెంబర్‌‌ 30వ తేదీ రాష్ట్రంలో రూ.250 కోట్ల అమ్మకాలు జరిగాయి. 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే రూ.150 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మరో రూ.30 కోట్ల అమ్మకాలు జరిగాయి.

గతేడాది డిసెంబర్ 31వ తేదీ రూ.100 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని, ఈసారి దీనికి 50 శాతం కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్​ నుంచి 19తేదీ వరకు రూ.1036 కోట్లు సేల్ చేయగా, నెల మొత్తం రూ. 2250 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు.

Related posts

జ‌ల్‌ప‌ల్లి క‌మాన్ ద‌గ్గ‌ర యువ‌తి దారుణ‌ హ‌త్య‌..

Sub Editor

తెలంగాణ ప్రజలు బిజెపి పార్టీని నమ్మరు

Satyam NEWS

10 రెట్లు వేగంగా కరుగుతున్న హిమాలయాలు

Sub Editor

Leave a Comment