ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ మహాకుంభం మొదటి 2 రోజుల్లో 5.15 కోట్ల మంది స్నానాలు చేశారు. తొలిరోజు మహా కుంభంలో 1.65 కోట్ల మంది స్నానాలు చేయగా, మకర సంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది స్నానాలు చేశారు. హింస జరగలేదు! కులం, మతాల ప్రస్తావన లేదు! పౌరసత్వం గురించి ఎవరినీ అడగలేదు. ఎవరినీ కించ పరచలేదు! మరే ఇతర మతాన్ని చిన్నచూపు చూడలేదు. ప్రపంచం నలుమూలల నుంచి ధనవంతులు, అన్ని వర్గాల భక్తులు వచ్చి తమ మతాన్ని ఆచరించి ఆనందించారు. కోట్ల మందికి ఆహారం, నీళ్లు తదితర మౌలిక వసతుల ఏర్పాటు చేశారు. ప్రయాగ్ రాజ్‌లో నివాస వసతి కూడా ఉంది. కొన్ని లక్షల మందికి ఈ సదుపాయాలు పూర్తిగా ఉచితంగా అందించారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళా అతీంద్రియమైనది, ఊహకందనిది, మరపురానిదిగా మిగిలిపోయింది.
previous post
next post