దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 14 మంది సభ్యులు కడిపికొండ నుంచి విహార యాత్రకు వెళ్లగా అందులో ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు. మరో 9 మంది ఆచూకీ ఇప్పటి వరకూ దొరకలేదు. ఈ గోదావరి పడవ ప్రమాదంలో మృతదేహాలు దొరికిన వారి వివరాలు : 1.బాసికే దశరథం, 2.గోరె ప్రభాకర్, 3.దర్శనాల సురేష్, 4.బాసికే వెంకటస్వామి, 5.అరెపల్లి యాదగిరి. ఆదివారం విహార యాత్రకు వెళ్లి సోమవారం తిరిగి వచ్చేద్దామనుకున్న వీరికి ఈ ప్రమాదం సంభవించింది.
previous post