30.3 C
Hyderabad
March 15, 2025 10: 10 AM
Slider విశాఖపట్నం

సంక్రాంతి వేళ చిన్నారి మృత్యువాత

#accident

సంక్రాంతి పండగ కు వచ్చిన ఒక ఐదేళ్ళ చిన్నారి మృత్యువాత పడిన విషాదకర సంఘటన విశాఖపట్నంలో జరిగింది. దాంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. సెలెస్ట్ అపార్ట్మెంట్లో సెల్లార్ వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. దాంతో ఈ ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీ ఉద్యోగి నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. సుజాతనగర్ కు చెందిన దంపతులు సెలస్ట్ అపార్ట్మెంట్లోని బంధువుల ఇంటికి సంక్రాంతి పండక్కి వచ్చారు. చిన్నారి సెల్లార్ వద్ద ఆడుకుంటుండగా ఈ కారు ఢీకొట్టింది. కిమ్స్ హాస్పిటల్ తీసుకువెళ్తుండగా మార్గం మధ్య మృతి చెందినట్లు  వైద్యులు ధ్రువీకరించారు. దీనితో పండగ తో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Related posts

పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

Satyam NEWS

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

Murali Krishna

మహిళలందరూ కలిసి బీజేపీని అధికారంలోకి తేవాలి

mamatha

Leave a Comment