37.2 C
Hyderabad
March 28, 2024 17: 48 PM
Slider ప్రత్యేకం

పెద్ద సినిమాలకు మళ్లీ పొంచిఉన్న కరోనా గండం

#bigcinemas

సినీ రంగాన్ని కరోనా వదలడం లేదు. ఏడాదికి పైగా ధియేటర్లు మూతపడి షూటింగ్ లు ఆగిపోయి లక్షలాది మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు.

ఆ దశ దాటి కరోనా లాక్ డౌన్ సడలింపులతో మళ్లీ ధియేటర్లు తెరచుకున్నాయి.

కొద్ది రోజులు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచినా ఆ తర్వాత పూర్తి స్థాయిలో సినిమాహాళ్లు తెరవడంతో సినీ జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కరోనా న్యూ వేరియట్ వైరస్ కూడా బయటపడింది. పెరుగుతున్న కేసులతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితులకు ప్రభుత్వాలు చేరుకున్నాయి.

సంపూర్ణ లాక్ డౌన్ ఉండదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్లారిఫికేషన్ ఇచ్చింది. అయితే సినిమా ధియేటర్లకు మాత్రం మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన తీసుకురాబోతున్నారని తెలిసింది. 50 శాతం సీట్లు మాత్రమే ధియేటర్లలో భర్తీ చేయాల్సి ఉంటుంది.

50 శాతం భర్తీతో కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు తమ సినిమాల విడుదల వాయిదా వేసుకుంటున్నారు. 50 శాతం ఆక్యుసెన్సీ నిబంధన ఈ నెల 15 నుంచి అమలు కాబోతున్నట్లు తెలిసింది.

తొలి దశలో ఈ నెల 30వ తేదీ వరకూ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలు చేస్తారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అందుకే పెద్ద సినిమాల విడుదల వాయిదా వేస్తున్నారు. ఈ నెల 16న విడుదల కావాల్సిన అక్కినేని నాగచైతన్య సినిమా లవ్ స్టోరీ విడుదల వాయిదా వేశారు.

అదే విధంగా నాని సినిమా టక్ జగదీష్ ఈ నెల 23న విడుదల చేయాల్సి ఉండగా దాన్ని కూడా మే 1వ తేదీకి పోస్టుపోన్ చేశారు. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన కొనసాగే పక్షంలో పుష్ప, ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా విడుదల నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.

ఈ మేరకు పైకి ప్రకటించకపోయినా నిర్మాతలు అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

Related posts

అక్రమాలకు పాల్పడ్డ వెంకటగిరి ఎమ్మార్వో ఆదిశేషయ్యపై వేటు

Satyam NEWS

తెలుగుదేశంలో తొంగి చూస్తున్న ఉత్సాహం

Bhavani

కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

Leave a Comment