28.7 C
Hyderabad
April 20, 2024 06: 18 AM
Slider విజయనగరం

విజయనగరం జిల్లాలో 50,148 మందికి విద్యాదీవెన‌…!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 50,148 మంది విద్యార్థుల‌కు, విద్యాదీవెన ప‌థ‌కం క్రింద అక్షరాలా 26కోట్ల‌, 97ల‌క్ష‌ల‌, 29వేల‌, 987 డబ్బును, సీఎం జగన్ నేరుగా విద్యార్థుల అకౌంట్ లోకి జమ చేశారు. అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సిఎం బ‌ట‌న్ నొక్కి, విద్యార్థుల త‌ల్లుల ఖాతాలో ఈ మొత్తాన్ని నేరుగా జ‌మ చేశారు.

వివిధ క‌ళాశాల‌లు, ఐటిఐ, పాలిటెక్నిక్‌ల‌లో చ‌దువుతున్న‌ప్ర‌తీ పేద విద్యార్థికీ, పూర్తి పీజు రీఎంబ‌ర్స్ మెంట్ క్రింద ఈ మొత్తాన్ని విడుద‌ల చేశారు. మొత్తం 50,148 మంది విద్యార్థుల్లో బిసిలు 40,408 మంది, ఎస్‌సిలు 4,843, ఈబిసిలు 2,843, కాపు 1,007, ముస్లిం 248, క్రిష్టియ‌న్లు 42 మంది ఉన్నారు. బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో 7,720 మంది విద్యార్థుల‌కు 4.37కోట్లు, చీపురుప‌ల్లిలో 6,246 మందికి 3.06 కోట్లును, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 7,837 మందికి 4.01కోట్ల‌ను , నెల్లిమ‌ర్ల‌లో 6,402మందికి 3.28కోట్ల‌ను, రాజాంలో 7,991 మందికి .4.00 కోట్ల‌ను, సాలూరులో 1,177 మందికి 57.1ల‌క్ష‌ల‌ను, ఎస్‌.కోట‌లో 6,809 మందికి 3.81 కోట్ల‌ను, విజ‌య‌న‌గ‌రంలో 5,966 మందికి 3.83 కోట్లు, జులై-సెప్టెంబ‌రు త్రైమాసికానికి సంబంధించి, మొత్తం 26.97 కోట్ల‌ను విద్యాదీవెన క్రింద‌ విడుద‌ల చేశారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, బాగా చ‌దువుకొని విద్యార్థులు వృద్దిలోకి రావాల‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. విద్యాదీవెన ప‌థ‌కానికి సంబంధించిన‌ చెందిన చెక్కును, విద్యార్థుల‌కు, వారి తల్లి తండ్రులకు క‌లెక్ట‌ర్ పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, జిల్లా బిసి సంక్షేమాధికారి ఎం.య‌శోధ‌న‌రావు, గిరిజ‌న సంక్షేమాధికారి చంద్ర‌శేఖ‌ర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అస్వస్థత నుంచి కోలుకున్న గాయని లతా మంగేష్కర్

Satyam NEWS

స్పెషల్ బ్రాంచ్ అంటే జిల్లా పోలీస్ శాఖకు కళ్ళు చెవులు లాంటిది

Satyam NEWS

ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తాం: మంత్రి పొంగులేటి

Satyam NEWS

Leave a Comment