36.2 C
Hyderabad
April 25, 2024 20: 54 PM
Slider ప్రత్యేకం

కేంద్రం నిషేధించిన 59 చైనా యాప్ ల వివరాలు

#TikTok App

మొత్తం 59 మొబైల్ యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ భద్రత, సమగ్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐటి చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం తమకు దఖలు పడిన అధికారాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

డేటా సెక్యూరిటీతో బాటు 130 కోట్ల భారతీయుల భద్రత అంశం తమకు ప్రధమ ప్రాధామ్యమని భారత ప్రభుత్వం తెలిపింది. దీనికి భంగం కలిగే అవకాశం ఉన్నందునే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. సైబర్ క్రయిం కో ఆర్డినేషన్ కమిటీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిషేధించిన యాప్ లలో టిక్ టాక్, షేర్ ఇట్, క్వాయ్,

యుసి బ్రౌజర్, బైదూ మ్యాప్, షీన్, క్లాష్ ఆఫ్ కింగ్స్, డియు బ్యాటరీ సేవర్, హెలో, లైకీ,  యూకెమ్ మేకప్, మై కమ్యూనిటీ, సిఎం బ్రౌజర్స్, వైరస్ క్లీనర్, ఏపియుఎస్ బ్రౌజర్, రోమ్ వే, క్లబ్ ఫ్యాక్టరీ, న్యూస్ డాగ్, బ్యూటరీప్లస్, వి ఛాట్, యుసి న్యూస్, క్యూ క్యూ మెయిల్, వైబో, జండర్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ న్యూస్ ఫీడ్, బిగో లైవ్, సెల్ఫీసిటీ, మెయిల్ మాస్టర్, ప్యార్లెల్ స్పేస్, మి వీడియోకాల్, వి సింక్,

ఇఎస్ ఫైల్ ఎక్సప్లోరర్, వివా వీడియో, మైటూ, విగో వీడియో, న్యూ వీడియో స్టేటస్, డియు రికార్డర్, వ్యాలెట్ హైడ్, క్యాచీ క్లీనర్, డియు క్లీనర్, డియు బ్రౌజర్, హెగో ప్లే, కామ్ స్కానర్, క్లీన్ మాస్టర్, వండర్ కెమెరా, ఫొటో వండర్, క్యూ క్యూ ప్లేయర్, వి మీట్, స్వీట్ సెఫ్ఫీ, బైదూ ట్రాన్స్ లేట్, విమేట్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూ క్యూ సెక్యూరిటీ సెంటర్, క్యూక్యూ లాంఛర్, యు వీడియో, వి ఫ్లై స్టేటస్ వీడియో, మొబైల్ లెజెండ్స్, డియు ప్రైవసీ ఉన్నాయి. ఇవన్నీ చైనా కు సంబంధించిన యాప్ లే.

Related posts

తవ్వి వదిలేసిన రోడ్లతో తంటాలు పడుతున్న ప్రజలు

Satyam NEWS

అర్చక సమాఖ్య కన్వీనర్ గంగు భానుమూర్తి మృతికి సంతాపం

Satyam NEWS

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలన్న సిఐటియు

Satyam NEWS

Leave a Comment