39.2 C
Hyderabad
April 25, 2024 15: 00 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని 5వ విడత పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నారు.
ఈనెల 28 నుండి బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర షురూ అవబోతోంది. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు బండి సంజయ్. ఈ అయిదవ విడత పాదయాత్ర ముగింపు సభ కరీంనగర్ లో ఉఃడబోతోంది. అలాగే వచ్చే నెల డిసెంబర్ 15 లేదా 16 వరకు కొనసాగనున్న 5వ విడత పాదయాత్ర కొనసాగనుంది. కాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర వివరాలను ప్రకటించారు.. ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్.

కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు వెల్లడించారు. పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే సంకేతాలు వెలువడ్డాయని పేర్కొన్నారు.. వీరేందర్ గౌడ్.

ఈనెల 26 నుండి వచ్చేనెల 14 వరకు ‘‘ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్ర’’ షురూ అవుతోందని కూడా చెప్పారు.ఒక్కో పార్లమెంట్ పరిధిలోని 1 లేదా 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ఉంటాయి. బైక్ ర్యాలీల వివరాలను వెల్లడించారు.. ‘‘ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర’’ ఇంఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు.మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్దన్నపేట,

మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా 200 బైక్ లతో 10 నుండి 15 రోజులపాటు బైక్ నిర్వహించడంతోపాటు స్థానిక సమస్యలపై ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.

Related posts

ఏపీఎస్ఆర్టీసీ లో తగ్గిన సరుకుల రవాణా చార్జీలు

Satyam NEWS

ఆసరా పెన్షన్ దరఖాస్తులకు మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం

Satyam NEWS

జగన్ గురూజీ ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం

Satyam NEWS

Leave a Comment