36.2 C
Hyderabad
April 25, 2024 20: 02 PM
Slider ముఖ్యంశాలు

నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం

#earthquake

నేపాల్‌లో భూకంపం సంభవించడంతో దిల్లీలో భారీ ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి దాటాక 1.57 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతగా నమోదైంది. దీంతో దిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్‌ ప్రాంతాల్లో పది సెకండ్ల పాటు ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. నేపాల్‌లో గత 5 గంటల్లోనే రెండోసారి భూమి కంపించింది. అంతకుముందు రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూప్రకంపనలు చోటుచేసుకున్న అర్ధగంటలోపే ఈ అంశం ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాదాపు 20వేల ట్వీట్లు చేశారు. భూకంప తీవ్రతకు నేపాల్‌లోని దోతి జిల్లాలో ఆరుగురు చనిపోయారు.

Related posts

పార్టీ నుంచి బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్

Murali Krishna

కోట్లు కొల్లగొడుతున్న వి ఆర్ ఓ కు ఉన్నతాధికారుల అండ?

Satyam NEWS

పయ్యావుల కేశవ్ భద్రత పూర్తిగా తొలగింపు: ఖండించిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment