పోలవరం ప్రధాన డ్యాం నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ఆరు గుత్తేదారు సంస్థలు పోటీపడుతున్నాయి. ఆ సంస్థల నుంచి టెండరు బిడ్లు దాఖలయ్యాయి. రూ. 274.55 కోట్ల ఐబీఎం విలువతో జలవనరుల శాఖ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈఎండీకి సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరిచూసుకుని ఈ సంస్థలు రివర్స్ టెండర్లలో పాల్గొనవచ్చని జలవనరులశాఖ నిర్ణయానికి వచ్చింది. పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆప్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్ఆర్సీఐఐపీఎల్, డబ్యూసీపీఎల్ సంయుక్త భాగస్వామ్యం, మేఘ ఇంజినీరింగా లిమిటెడ్, ఎంఆర్కేఆర్ ఎస్ఎల్ఆర్ సంయుక్త భాగస్వామ్యంతో మెుత్తం 6 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.
previous post
next post